Jagan exempted from appearing before special CBI court

Hc breather for jagan in da case

Justice Raja Elango, Y.S. Jaganmohan Reddy, YSRCP, special CBI court, HighCourt, HighCourt breather for Jagan in DA case, special CBI court, jagan illegal investments case, jagan disproportionate assets case, Punith Dalmia, Dalmia Cements MD, Pratap Reddy, Penna Cements pratap reddy, cbi

Hyderabad High Court declared that Y.S. Jaganmohan Reddy of the YSRC need not appear in person in the special CBI court in the cases pertaining to the illegal investments and disproportionate assets (DA) cases.

జగన్ కు హైకోర్టులో ఊరట.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు

Posted: 04/01/2016 11:59 AM IST
Hc breather for jagan in da case

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కు ఊరట లభించింది. ఈ మేరకు క్రితం రోజున హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక ప్రతి శుక్రవారం కోర్టు జరయ్యే మీరు నాయకులు, మీరు చెప్పేది మేము వినాలి అనే టీడీపీ నేతల విమర్శలకు ఇకపై బ్రేక్ పడనుంది. వివరాల్లోకెళితే... తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు వేనకేసుకున్నారన్న ఆభియోగాలపై దర్యాప్తు చేసిన సీబీఐ జగన్ పై 11 కేసులు పెట్టి.. అందుకు సంబంధించి చార్జిషీట్లను కూడా కోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే.

సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లకు సంబందించిన విచారణ ప్రస్తుతం హైదరాబాదు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యే కోర్టులో ప్రతి శుక్రవారం జరుగుతుండగా వాటి విచారణకు జగన్ తో పాటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని కోర్టు చెప్పింది. అయితే ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న తాను అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నందున కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

జగన్ తరపున ఆయన న్యాయవాది మహంతీ వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో... కేసు విచారణలో భాగంగా ప్రతీ వారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కల్పిస్తూ జగన్ కు ఊరటనిస్తూ న్యాయస్థానం మధ్యతంత ఉత్తర్వులను జారీ చేసింది. జగన్ తో పాటుగా దాల్మియా సిమెంట్స్ అధినేత పునీత్ దాల్మియాకు, పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డీలకు కూడా వ్యక్తిగత హాజరు నుంచి న్యాయస్థానం మినహాయింపు లభించింది.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Justice Raja Elango  Y.S. Jaganmohan Reddy  YSRCP  special CBI court  HighCourt  

Other Articles