Kanhaiya has qualities like Bhagat Singh, says Shashi Tharoor

Kanhaiya has qualities like bhagat singh says shashi tharoor

Shashi Tharror, kanaiah kumar, Bhagath Singh, Delhi, BJP, Congress

A controversy erupted on Monday over Congress leader Shashi Tharoor comparing JNU students’ union president Kanhaiya Kumar, facing sedition charges, with Bhagat Singh, drawing strong criticism from BJP, which accused the former Union Minister of insulting the freedom fighter. During his over 43-minute long speech at JNU campus on Sunday evening, Tharoor said, “Bhagat Singh was a young man in his 20s with Marxist beliefs who had great passion for motherland. Kanhaiya has same qualities in common.”

కన్హయ్య ఈ కాలపు భగత్‌సింగ్..? ధరూర్ వివాదాస్పద వ్యాఖ్య

Posted: 03/22/2016 06:40 AM IST
Kanhaiya has qualities like bhagat singh says shashi tharoor

దేశంలో సంచలనానికి దారితీసిన దేశద్రోహం కేసు కింద అరెస్టైనా దిల్లీ జెఎన్ యు విద్యార్థి కన్హయ కుమార్ ను ఉద్దేశించి తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుుడు శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మంటలు రేపుతున్నాయి. బ్రిటిష్ కాలంలో దేశద్రోహం చట్ట బాధితుల్లో ముఖ్యులు జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ, బాల్ గంగాధర్ తిలక్, అనీబీసెంట్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని లేచి భగత్‌సింగ్ కూడా అని గుర్తు చేశారు. దీనికి శశిథరూర్ స్పందిస్తూ.. కన్హయ్యకుమార్ ఈ కాలపు భగత్‌సింగ్ అని పేర్కొన్నారు. భగత్‌సింగ్ వామపక్ష భావజాలంతో విదేశీ ప్రభుత్వంపై పోరాడారని.. కన్హయ్యకుమార్ మోదీ ప్రభుత్వానికి, దేశంలోని పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో స్పందించింది.

దేశద్రోహం కేసులో నిందితుడిని స్వాతంత్య్ర సమరయోధుడితో పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అని బిజెపి పార్టీ నేత షానవాజ్ హుస్సేన్ విమర్శించారు. సోమవారం కన్హయ్యకుమార్ భగత్‌సింగ్ అయితే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్‌తివారీ స్పందిస్తూ.. దేశంలో భగత్‌సింగ్ ఒక్కడేనని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో శశిథరూర్ స్పందిస్తూ.. తాను కన్హయ్యను భగత్‌సింగ్‌తో పోల్చలేదన్నారు. విద్యార్థుల్లో ఒకరి వ్యాఖ్యలకు స్పందనగానే తాను మాట్లాడినట్లు తెలిపారు. పరిస్థితులు వేర్వేరు అయినా, ఇద్దరూ చిన్నతనంలోనే వామపక్ష భావజాలంతో దేశంకోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నారు. ఇద్దరు 20 ఏళ్ల వయస్సువాళ్లే అని థరూర్ వివరణ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shashi Tharror  kanaiah kumar  Bhagath Singh  Delhi  BJP  Congress  

Other Articles