Am not like younger sister for him

Am not like younger sister for him

Roja, ANitha, YSRCP, AP, Assembly, Jagan

TDP MLA Anitha onemore time attacked on YSRCP MLA Roja. She said need justice on the Roja issue.

ఆయనకు నేను చెల్లెల్ని కానా..? ఎమ్మెల్యే అనిత

Posted: 03/22/2016 06:33 AM IST
Am not like younger sister for him

నిన్న రోజా సస్పెన్షన్ మీద జరిగిన చర్చ చాలా ఆసక్తిగా సాగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే అనిత మరోసారి రోజా మీద సభలో చర్చించి... తన బాధను వెల్లగక్కింది. సోషల్ మీడియాలో రోజా, అనిత అని సెర్చ్ చేస్తే, రోజా తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని ఆమె మరోసారి బాధపడ్డారు. ఈ విషయంలో తన భర్త, పిల్లలు ఎంతో బాధపడుతున్నారని, వారి బాధను ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. తాను రోజాతో క్షమాపణలు మాత్రమే కోరానని అనిత వెల్లడించారు.

రోజాను వైసీపీ అధినేత జగన్ వెనకేసుకురావడం దురదృష్టకరమని ఎమ్మెల్యే అనిత వాపోయారు. "రోజాను రోజమ్మా అని పిలిచే జగన్, తనను అనితమ్మా అని పిలవలేరా? నేను చెల్లెమ్మను కాదా? నాకు న్యాయం చేయలేరా?" అని ప్రశ్నించారు. రోజా విషయంలో సభ తీసుకునే నిర్ణయం ఏదైనా తాను కట్టుబడివుంటానని అనిత స్పష్టం చేశారు. రోజా కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తపరచలేదని, ఆమెకు గరిష్ఠ శిక్ష విధించాలని స్పీకర్ కోడెలను అనిత కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  ANitha  YSRCP  AP  Assembly  Jagan  

Other Articles