hyderabad youth rave party busted in karnataka

Karnataka police busted hyderabad youth rave party

Karnataka Police, rave party, prostitution, private resort, samruddhi samskruti resort, hyderabadis, agriculture marketing company, TV anchor, private TV channel anchor, Krupashankar Paswan, Kumta court, Mahila Sweekara Kendra, Karwar, accused, hyderabad youth arrested in karnataka, hyderabad youth arrested in gokarna

Karnataka Police busted an alleged prostitution racket and arrested 27 persons including eight women from a private resort at Gokarna.

కర్ణాటకలో హైదరాబాదీల రేవ్ పార్టీ.. పట్టుబడిన టీవీ యాంకర్

Posted: 03/21/2016 01:49 PM IST
Karnataka police busted hyderabad youth rave party

హైదరాబాద్ నగరంలో పోలీసుల అటు డ్రంక్ అండ్ డ్రైవ్, ఇటు రేవ్ పార్టీలపై కోరఢా ఝుళిపించడంతో.. నగర యువత రూటు మార్చారు. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాల్లోని నగర శివారు ప్రాంతాలలో కూడా పటిష్ట నిఘాను ఏర్పాటు చేసిన పోలీసులు ఎక్కడ ఏ రకంగా పార్టీలు జరిగినా.. అక్కడ వాలిపోతూ.. నిర్వాహకులను, యువతను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నారు. దీంతో ఎటూ పాలుపోని యువత తమ ఆనందం కోసం రూటు మార్చారు.

ఏకంగా రాష్ట్ర సరిహద్దులు దాటి తమ ఆనందాన్ని, సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. అయితే అనేక మంది యువత హైదరాబాద్ నుంచి కర్ణాటకకు చేరుకుని మన దేశ సంస్కృతి, సంప్రదాయాన్ని తోసిరాజి, పాశ్చాత్య సంస్కృతి వైపు అకర్షితులై.. వీకెండ్ పార్టీల పేరుతో రేవ్ పార్టీలు జరుపుకుంటున్నారు. ముందుగా ఏదో తక్కువ సంఖ్యలో వచ్చే యువత రాను రాను పెద్ద సంఖ్యల రావడం, అర్థనగ్న నృత్యాలు, అసభ్య సృత్యాలు చేయడం, మద్యం సేవించడంతో అక్కడి పోలీసులకు కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో వీకెండ్ పార్టీల్లో ఎంజాయ్ చేసే వారిని ఓ కంట కనిపెడుతున్నారు.
 
తాజాగా కోలార్ జిల్లా మలూరులో రేవ్ పార్టీలో పాల్గొన్న యువతను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి వీకెండ్‌ను పురస్కరించుకుని రేవ్ పార్టీలో యువత చిందులు తొక్కింది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేశారు. ఈ సందర్భంగా రేవ్ పార్టీని ఏర్పాటు చేసిన నలుగురు నిర్వాహకులతో పాటు అక్కడ అసభ్యకర రీతిలో అర్థ నగ్న నృత్యాలు చేస్తున్న 10 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువతులంతా హైదరాబాదుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కాగా అంతకుముందు గోర్నాకాలోని సమృద్ది సంస్కృతి అనే రిసార్టులో ఈ తరహా పార్టీని నిర్వహించిన 27 మందిని హైదరాబాదీయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కాగా వారిలో ఒక ప్రవేటు టీవీ ఛానల్ కు చెందిన యాంకర్ కూడా వుందని సమాచారం.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad youth  karnataka police  rave party  private resort  

Other Articles