Jagan Mohan Reddy belives that MLA very much

Jagan mohan reddy belives that mla very much

YS Jagan, Bugana Rajendranath, Bugana, AP, PAC Chairman, Bhuma Nagi Reddy

YSRCP President JaganMohan Reddy propose Bugana Rajendranath Reddys name for PAC Chairman. Senior MLAs shocked with Jagans decision.

ఆ ఎమ్మెల్యేపై జగన్ కు అంత ప్రేమా..?

Posted: 03/21/2016 01:49 PM IST
Jagan mohan reddy belives that mla very much

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు ఎవరి మాట వినడు అనే ఓ చెడ్డపేరుంది. ఆయన సీనియర్ల మాటలను కనీసం ఖాతరు కూడా చెయ్యరని, మైసూరా రెడ్డిలాంటి ఉద్దండ పండితుడి మాటను కూడా లెక్కచెయ్యరు అని చాలా మంది చర్చించుకుంటారు. కానీ తాజాగా అదే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ జూనియర్ ఎమ్మెల్యే మీద ఎంతో నమ్మకం పెంచుకున్నారు. నిన్నటి దాకా ఆ ఎమ్మెల్యే పేరు కూడా తెలియని చాలా మంది ఇది చూసి ఆశ్చర్యపోతున్నారు. పైగా జగన్ అతడికి ఓ పదవి కూడా కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్ అంతలా నమ్మకం పెట్టుకున్న ఎమ్మెల్యే ఎవరా అనుకుంటున్నారా..? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టాలెంట్ ను గుర్తించిన జగన్ తాజాగా ఏపి పిఎసి చైర్మెన్ గాఎంపిక చేశారు. ఇటీవల భూమా నాగిరెడ్డి రాజీనామాతో ఆయన స్థానంలో బుగనను అనుకుంటున్నారట. భూమా స్థానంలో అదే జిల్లాకు చెందిన బుగనను జగన్ ప్రతిపాదించనున్నారట. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని, జూనియర్ కు జగన్ అవకాశం కల్పించడం వైసీపీ లోనే కాకుండా మిగిలిన పార్టీల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  Bugana Rajendranath  Bugana  AP  PAC Chairman  Bhuma Nagi Reddy  

Other Articles