Dont u respect senior MLA

Dont u respect senior mla

MLA, Jeevan Reddy, Sampath Kumar, TS Assembly, Assembly

In the TS Assembly, A senior MLA asked to junior MLA to greet him. But Junior avoid it.

సీనియర్ ను పలకరించవా.? టిఎస్ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ

Posted: 03/21/2016 12:57 PM IST
Dont u respect senior mla

తెలంగాణ అసెంబ్లీలో ఓ సీనియర్ ఎమ్మెల్యే, జూనియర్ ఎమ్మెల్యేల మధ్ జరిగిన సంభాషణ అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సీనియర్ కాబట్టి కాస్త డాబు చూపిద్దామని అనుకున్న ఓ ఎమ్మెల్యేకి,జూనియర్ ఎమ్మెల్యే షాక్ ఇచ్చాడు. దాంతో అది చూసిన వారంతా.. అడిగిమరీ పెద్దరికం పోగొట్టుకున్నాడు అంటూ గుసగుసలాడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా..? తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య జరిగిన సంభాషణ మీరు కూడా చదవండి.

తెరాస పార్టీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నిన్న అసెంబ్లీ ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన సంపత్ కుమార్ తారస పడ్డాడు .అప్పుడు అటువైపుగా పోయే సంపత్ కుమార్ ను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆపి మరి “ఇంత పెద్ద మనిషిని పైగా అసెంబ్లీ రూల్స్ కమిటి మెంబర్ అయిన నేను ఎదురు పడితే కనీసం పలకరించకుండా పోతున్నావు అని అనగానే ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పందిస్తూ ఉకొ అన్న మీరు ఉండగా అసెంబ్లీ రూల్సా..? అసలు రూల్స్ ప్రకారం అసెంబ్లీ నడుస్తుందా అని అన్నారు . వెంటనే జీవన్ రెడ్డి సరదాగా నిన్ను ఆపి మరి తిట్టించుకున్ననే అని అనగా ఎమ్మెల్యే సంపత్ కుమార్ నవ్వుతు ఊరుకో అన్న మనం ఏదో సరదాగా అనుకున్నాం మనసులో పెట్టుకోకు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA  Jeevan Reddy  Sampath Kumar  TS Assembly  Assembly  

Other Articles