Modi is the god for the poor

Modi is the god for the poor

Modi, Venkaiah naidu, Narendra Modi, God, Modi as God, India

While moving the political resolution on the second and last day of the BJP's national executive meeting, Mr Naidu said, "Modi is God's gift for India. He is the messiah of the poor. He inherited challenges in each and every sector. He is steering clear of them."

పేదల దేవుడు మోదీ

Posted: 03/21/2016 11:56 AM IST
Modi is the god for the poor

ప్రధాని మోడీని పొగడ్తలతో ముంచెత్తారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. అందరితో కలిసి అందరి వికాసానికి అనే నినాదంతో ముందుకు ప్రధాని వెళుతున్నారన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఆయన.. సుపరిపాలన.. అభివృద్ధి తోడుగా మోడీ సర్కార్ పనిచేస్తుందన్నారు. ప్రధాని మోడీ భారత దేశానికి దేవుడిచ్చిన వరమని.. పేదల పాలిట భగవంతుడని.. ప్రశంసించారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్‌లో ఆయన జన్మస్థలానికి ప్రధాని వెళ్తారని ఈ సందర్భంగా ప్రకటించారు.

మోదీ దేశాన్ని ప్రపంచంలో సుసంపన్నం చెయ్యడానికి అహర్నిషలు ప్రయత్నిస్తున్నారని వెంకయ్య నాయుడు అన్నారు. టైమ్ మ్యాగజీన్ లో టాప్ వందలో చోటుసంపాదించారని, తాజాగా 30 స్థానాన్ని సంపాదించారని వెల్లడించారు. సోషల్ మీడియాలో మోదీ ప్రభంజనం కొనసాగుతోందని కూడా ఆయన అన్నారు. మోదీకి 18 మిలియన్ల ట్విట్టర్ ఫాలోవర్లు, ఫేస్ బుక్ లో 32 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారని అన్నారు. అలాగే తాజాగా వ్యాక్స్ మ్యూజియంలో కూడా మోదీ విగ్రహానికి చోటుదక్కిందని ఆయన గుర్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Venkaiah naidu  Narendra Modi  God  Modi as God  India  

Other Articles