New PIL to register criminal cases Chandrababu and Kodela

New pil to register criminal cases chandrababu and kodela

Gopala Krishna kalanidhi, Chandrababu, Kodela Shivaprasad, AP, Assembly

Gopala Krishna Kalanidhi file a PIL to register criminal cases on AP cm Chandrababu Naidu and AP Assemlby speaker Kodela Shivaprasad.

ఏపి ముఖ్యమంత్రి, స్పీకర్ పై క్రిమినల్ కేసులు..!

Posted: 03/21/2016 11:36 AM IST
New pil to register criminal cases chandrababu and kodela

ఏపి అసెంబ్లీ వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. రోజా వ్యవహారంలో రోజుకో మలుపుచోటుచేసుకుంటోంది. హైకోర్టు రోజాను అసెంబ్లీ సమావేశాలు హాజరయ్యేందుకు అనుమతినిచ్చినా కానీ స్పీకర్ మాత్రం అందుకు అంగీకరించలేదు. దాంతో వైసీపీ దీని మీద తీవ్రంగా మండిపడింది. స్పీకర్ కనీసం కోర్టుల తీర్పును కూడా గౌరవించకపోతే ఎలా అని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. కోర్టు తీర్పును కూడా గౌరవించకపోవడం మీద వైసీపీ ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేసింది. కాగా తాజాగా ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలంటూ పిల్ దాఖలైంది.

వైసీపీ ఎమ్మెల్యే ఆర్.కె రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోవడం మీద వివాదం నడుస్తోంది. హైకోర్టు తీర్పులో రోజా సస్పెన్షన్ ను ఎత్తివేసింది. కాగా ప్రస్తుత సమావే:శాలకు హాజరయ్యేందుకు అవకాశం కూడా కల్పించింది. కానీ స్పీకర్ మాత్రం దీని మీద నేడు చర్చించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మరోపక్క ప్రివిలేజ్ కమిటి మాత్రం రోజా సస్పెన్షన్ ను సమర్థించింది. కొడాలి నాని వ్యవహారం మీద శాసనసభ నిర్ణయం తీసుకోవచ్చని కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాగా కోర్టు తీర్పును ధిక్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం మీద హైకోర్టులో తాజాగా ఓ పిల్ దాఖలైంది. శాసనసభకు హాజరయ్యేందుకు రోజా వెళ్లగా, ఆమెను మార్షల్స్ అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వలేదు. సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకుండా చంద్రబాబు, కోడెల కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని గోపాలకృష్ణ కళానిధి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబు, కోడెలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ పై కోర్టు రేపు విచారణ చేపట్టనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopala Krishna kalanidhi  Chandrababu  Kodela Shivaprasad  AP  Assembly  

Other Articles