Horrifying moment mobile phone sets man on fire

Horrifying moment mobile phone sets man on fire

Mobile, Phones, Islamabad, Pakistan

Horrifying footage shows the moment man becomes engulfed in a ball of flames after his phone catches fire in his pocket

ITEMVIDEOS: జేబులో ఉన్న మొబైల్ నుండి మంటలు

Posted: 03/21/2016 10:57 AM IST
Horrifying moment mobile phone sets man on fire

చైనా ఫోన్లు మార్కెట్ లోకి వచ్చినప్పటి నుండి మొబైల్ ఫోన్లకు గ్యారెంటీ లేకుండాపోయింది. ముఖ్యంగా బ్యాటరీల కారణంగా మొబైల్స్ కాలిపోవడం.. చార్జింగ్ పెడుతుంటే మంటలు రావడం లాంటి వాటి గురించి విన్నా.. చూశాం. కానీ ఓ వ్యక్తి జేబులో ఉన్న మొబైల్ నుండి వచ్చిన మంటలు అతడి ఒళ్లంతా వ్యాపించాయి. దాంతో పాపం.. కేకలు వేస్తూ.. తిరిగాడు. చివరకు ఇద్దరు వ్యక్తులు నీళ్లు చల్లడంతొ మంటలు ఆరిపోయాయి. ఈ ఘటన పాకిస్థాన్ లో జరిగింది.

పాకిస్థాన్ లోని ఇస్తామాబాద్ లో ఓ వ్యక్తి బస్సు దిగి.. అలా నడుచుకుంటు మార్కెట్ లోకి వచ్చాడు. ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్న పలంగా ఆ వ్యక్తి జేబులో ఉన్న మొబైలో మంటలు చెలరేగాయి. వెంటనే ఆ మొబైల్ ను కిందకు విసిరేసినా.. క్షణాల్లో ఆ మంటలు ఒళ్లంతా వ్యాపించాయి. దాంతో భయపడిన ఆ వ్యక్తి అరుచుకుంటూ మార్కెట్ లో పరిగెత్తాడు. అయితే ా వ్యక్తిని చూసి భయపడిన జనం ఎవరూ దగ్గరికి పోలేదు. ఇద్దరు వ్యక్తులు బకెట్లలో నీళ్లు తీసుకొని అతడిపై వెయ్యడంతో మంటలు ఆరిపోయాయి. నిన్నటి దాకా చార్జింగ్ పెడుతుంటే మంటలు, మొబైల్ పేలడంలాంటివి విన్నాం కానీ ఇలాంటివి మాత్రం కొత్తే. ఎందుకైనా మంచిది మొబైల్స్ ఉన్న వాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండండి,.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mobile  Phones  Islamabad  Pakistan  

Other Articles