Rahul Gandhi Asked To Explain British Citizenship Charge By Ethics Panel

Rahul gandhi issued notice by parliament s ethics committee

Rahul Gandhi,Parliamentary Ethics Committee,LK Advani,Rahul Gandhi British citizenship,Subramanian Swamy,Sumitra Mahajan, parliament, british citizenship, rahul british citizen, congress party

Rahul Gandhi, asked by an ethics panel to explain whether he once declared himself a British citizen on the legal papers of a company in the UK, said today on the notice: "We will deal with that."

‘అక్కడ’ దోరికిపోయిన రాహుల్ గాంధీకి ఎథిక్స్ కమిటీ తాకీదులు..

Posted: 03/14/2016 11:56 AM IST
Rahul gandhi issued notice by parliament s ethics committee

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతీయతపై గత కొన్ని రోజులుగా రేగుతున్న దుమారం తాజాగా మరో మలుపు తిరిగింది. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఆయన వచ్చి రాగానే, నరేంద్రమోడీ ప్రభుత్వంపై ఎక్కుపెట్టారు. భూ సమీకరణ చట్టంలో సవరణలు ఎలా చేస్తారంటూ.. విమర్శలు సంధించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని తూర్పారబట్టారు. అంతేకాదు.. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా.. అక్కడ వాలిపోతూ ప్రజలకు, బాధితులకు తానున్నానన్న భరోసా కల్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపి పార్టీలో చేరి ఆ అధికారాన్ని అనుభవిస్తున్న బిజేపి నేత సుబ్రహ్మణ్యస్వామి రాహుల్ గాంధీని తన జాతీయతపై టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీ తనకు తాను బ్రిటెన్ పౌరుడిగా పేర్కోన్నాడన అరోపణలు చేసి దుమారాన్ని రేపాడు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. తన జాతీయత గురించి ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదని, ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదని అంటూ చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా రాహుల్ గాంధీకి పార్లమెంటు ఎధిక్స్ కమిటీ తాకీదులు పంపింది. రాహుల్ గాంధీకి నోటీసులు పంపించినట్లు పార్లమెంటు ఎథిక్స్ కమిటీ సభ్యుడు అర్జున్ రామ్ మెగ్వాల్ తెలిపారు. బ్రిటన్లోని ఓ కంపెనీకి సంబంధించిన పత్రాల్లో రాహుల్ తనను తాను బ్రిటన్ పౌరుడిగా పేర్కొన్నారని, అలా ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో డిమాండ్ చేశారు. 'బ్రిటన్ సిటిజన్ గా తనను తాను ఎందుకు రాహుల్ గాంధీ పేర్కొన్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చాం' అని అర్జున్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

 మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Citizenship  Lok Sabha  Ethics Panel  notice  Rahul gandhi  

Other Articles