Telangana Finance Minister Eetela Rajender presents Telangana budget

Telangana finance minister eetela rajender presents telangana budget

Budget, Budget 2016,telangana Budget, Eetela Rajender, Telangana

Telangana Finance Minister Eetela Rajender presents Telangana budget. budget with one lakh thirty thousands lakh crores.

లక్షా 30 వేల కోట్ల తెలంగాణ బడ్జెట్

Posted: 03/14/2016 12:09 PM IST
Telangana finance minister eetela rajender presents telangana budget

తెలంగాణ రాష్ర్ట బడ్జెట్ -2016ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ర్టంపై దశాబ్దాల పాటు వివక్ష కొనసాగిందని తెలిపారు. ప్రజల అనేక ఆశలు, ఆకాంక్షాలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపకల్పన చేశామన్నారు. వాస్తవాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బడ్జెట్ ఇదే అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈటెల రాజేందర్ మూడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కేంద్రం నుండి ఎలాంటి చేయూత లేదని అంటూనే.. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆయన ప్రసంగించారు. వాస్తవాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బడ్జెట్ అని పేర్కొన్నారు. మూడోసారి రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. కేంద్రం నుంచి అందిన సాయం కేవలం రూ.450 కోట్లు మాత్రమేనని వెల్లడించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పెంచినా ఇంకా అమలుకాలేదని వివరించారు. సీఎం కేసీఆర్ పరతీ శాఖ పనితీరును సమీక్షిస్తున్నారని తెలిపారు. ప్రతిశాఖ నుంచి వచ్చే ఆదాయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని వివరించారు. గత రెండేళ్లుగా సరైన వర్షపాతం నమోదుకాలేదని తెలిపారు. స్థూల ఉత్పత్తి 11.67 శాతం నమోందని వెల్లడించారు.

* బడ్జెట్ రూ.1,30,415.87 కోట్లు
* ప్రణాళికా వ్యయం 67,630.73 కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ.62,785.14 కోట్లు
* రెవెన్యూ మిగులు రూ.3,318 కోట్లు
* ద్రవ్యలోటు అంచనా రూ.23,467.29 కోట్లు
* రుణమాఫీకి 3718 కోట్లు
* పాలమూరు ఎత్తిపోతలకు రూ. 7,861 కోట్లు.
* నీటి పారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు
* సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ. 1,150 కోట్లు
* కాలేశ్వరం ఎత్తిపోతలకు రూ. 6,286 కోట్లు
* స్థూల ఉత్పత్తి 11.47 శాతంగా నమోదు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Budget  Budget 2016  telangana Budget  Eetela Rajender  Telangana  

Other Articles