YSRCP issue notices for No confidence motion in AP assembly

Ysrcp issue notices for no confidence motion in ap assembly

YSRCP, AP, No Confidence Motion, AP Assembly

YSRCP issues No Confidence motion on Chandrababu Naidu govt. Jyothula Nehru propose to debate on No Confidence motion.

ఏపిలో ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం

Posted: 03/14/2016 11:52 AM IST
Ysrcp issue notices for no confidence motion in ap assembly

వాడివేడిగా సాగుతున్న ఏపి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానానికి నోటీసులు పంపింది. ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు వాయిదా పడిన తరువాత సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అవిశ్వాసం తీర్మానం పై చర్చించారు. వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై సభాపతి సభ్యుల అభిప్రాయం కోరారు. దీంతో మద్దతు తెలుపుతూ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా...అవిశ్వాసానికి మద్దతు తెలుపుతూ నిలబడ్డారు. దీంతో అవిశ్వాస తీర్మానంపై బీఎసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని స్పీకర్ మన్నారు.

గత 22 నెలల కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని నోటీసులో పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలోను, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోను అధికార పక్షం ఘోరంగా విఫలమైందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అంటున్నారు. తాము ప్రజాసమస్యల మీద పోరాడుతుంటే.. చంద్రబాబు సర్కారు మాత్రం తాము అవినీతితో సంపాదించిన సొమ్ముతో మరింత విచ్చలవిడిగా ప్రవర్తిస్తోందని మండిపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లువుతున్నా, ఏ వర్గానికి చెందిన ప్రజలకూ ఏమీ చేసిన దాఖలాలు కనిపించడం లేదన్నారు. కాగా అవిశ్వాసం మీద ఈరోజే చర్చ జరగాలని ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  AP  No Confidence Motion  AP Assembly  

Other Articles