mudragada goes on another protest, if fails to fullfill demands by 9th

Mudragada padmanabham slams chandrababu government

mudragada padmanabham, kapu leader, election promise, mudragada deadline, mudragada kirlampudi, chandrababu kapu election promise, another protest, chandrababu naidu, kapu reservations,

Andhra Pradesh kapu sangam leader mudragada padmanabham deadline to chief minister chandrababu naidu on fullfilling election promise to kapu caste.

చంద్రబాబు ప్రభుత్వానికి ముద్రగడ దడ.. మళ్లీ దీక్ష అనడంతో కలవరం..

Posted: 03/04/2016 01:54 PM IST
Mudragada padmanabham slams chandrababu government

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన ప్రభుత్వానికి మళ్లీ కలవరం మొదలైంది. పైపైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన మాత్రం ఆయన ప్రభుత్వం కలవరపాటుకు గురవుతుంది. ఇటీవలే కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన అమరణ దీక్షను విరమింపజేసి.. మళ్లీ తమ డిమాండ్లను నెరవేరుస్తామని హామీలు గుప్పించి.. మళ్లీ మళ్లీ మోసం చేయడాన్ని తప్పుబట్టిన కాపులు తూర్పారబడుతున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఈ నెల 10వ తేదీ నుంచి మరోమారు దీక్ష చేపడతానని ఆయన హెచ్చరించడంతో ప్రభుత్వంలో కలవరం పుడుతోంది. ముద్రగడ తన తాజా ప్రకటనతో వణుకు పుడుతుంది.

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ... ప్రభుత్వం కాపులకిచ్చిన హామీలను ఈ నెల 10 తేదీ లోపు తీర్చాలని..  ఈ డెడ్ లైన్ లోపు తీర్చని పక్షంలో ఈ నెల 11 నుంచి మళ్లీ ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను పరిష్కరించమని అడగటం తప్పా?, మా సమస్యలను పరిష్కరించమని అడగటం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. కులపోరాటాలను అణచివేస్తామని ప్రభుత్వం చెబుతుండటం ఎంత వరకు సబబు అని ఆయన అన్నారు.

కాపు కులస్తులకు ఇస్తున్న నలభై వేల రూపాయలతో ఏ వ్యాపారం చేయాలో చంద్రబాబు చెప్పాలని... తమ కులస్తులకు ఇస్తున్నఆ డబ్బులు, బాబు కొడుకు చెప్పుల ఖరీదు కూడా చేయవని కాపునేత ముద్రగడ వ్యాఖ్యానించారు. దరిద్రంలో ఉన్నాము.. దాని నుంచి బయటపడేయండి... కొంచెం అన్నం పెట్టండి అని అడిగితే చంద్రబాబు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ లోన్ పెట్టి తమ జాతిని అవమానిస్తున్నారని, కనీసం పదిలక్షల రూపాయలు ఇచ్చినా కూడా దరిద్రం నుంచి బయటపడలేని పరిస్థితుల్లో కాపు కులస్తులు ఉన్నారని ముద్రగడ అన్నారు.

‘నేను రాసిన లేఖను జగన్ చెబితే రాశానని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. అంటే, లేఖ రాసే పరిజ్ఞానం కూడా నాకు లేదా?’ అని ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. మాటమాట్లాడితే జగన్ చెప్పినట్లు తాను నడుచుకుంటున్నానని, లేఖ రాశానని బాబు అనడం ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. ‘ఒకళ్ల మోచేతి కింద నీళ్లు తాగి నేను బతుకుతున్నానా?’ అంటూ ఆయన మండిపడ్డారు. ‘ఒక్క విషయం ముఖ్యమంత్రి గారూ..జగన్ గారి వయస్సు నా రాజకీయ జీవితమంత లేదన్నారు.

చంద్రబాబుతో సమంగా తాను ఎన్నిక కాబడ్డానని.. మీ సంగతి జగన్ కు ఎం తెలుసు ... నాకు తెలుసు అని అన్నారు. రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం తన ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారని అరోపించారు. తనతో జగన్ మాట్లాడారని చంద్రబాబు గానీ, ఆయన ప్రభుత్వం కాని రుజువు చేయమని ఛాలెంజ్ చేశారు. తన ఉద్యమం వెనుక, ఉత్తరాల వెనుక, తన బ్రతుకు దెరువు వెనుక.. జగన్ పాత్ర ఉందని రుజువు చేస్తే అదే రోజు నుంచి ఉద్యమాన్ని వదిలేస్తానని, అంతేకాదు తన కుటుంబం కూడా రాజకీయాల్లో ఉండదని సవాల్ చేశారు. అలా చేయనిపక్షంలో మీరూ, మీ కుటుంబం రాజకీయాల నుంచి విరమించడానికి సిద్దమా అని ఛాలెంజ్ చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : mudragada padmanabham  chandrababu naidu  kapu reservations  election promise  

Other Articles