chandrababu Naidu to prove his innocence on Amaravati lands

Chandrababu naidu to prove his innocence on amaravati lands

Chandrababu Naidu, sakshi, Amaravati, Lands, AP, jagan, jaganmohan reddy, YSRCP

chandrababu Naidu to prove his innocence on Amaravati lands. Sakshi publish a story on Amaravati lands matter with Bhu Bhagotham Title.

చంద్రబాబూ.. నిప్పువో లేదంటే తుప్పువో తేల్చుకో

Posted: 03/04/2016 03:42 PM IST
Chandrababu naidu to prove his innocence on amaravati lands

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే పేరు మోసిన రాజకీయ నాయకుడు. రాజకీయ చాణిక్యుడిగా ఎంతో కీర్తి ప్రతిష్టలను సంపాదించాడు. హైటెక్ బాబుగా తెలుగు వారు భావించే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. నిజానికి ఏపిలో జగన్ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నంలో తెలుగుదేశం అండ్ కో పూర్తి నిబద్దతతో పని చేస్తున్నారు. వైసీపీ పార్టీ నుండి భారీగా చేరికలకు తెర తీశారు. అయితే జగన్ దాదాపు డైలమాలో పడ్డారు. పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి సైకిల్ ఎక్కుతుంటే వారిని ఆపలేక చతికిలపడ్డారు. అయితే పార్టీ పరిస్థితి, జగన్ రాజకీయ భవిష్యత్తు దాదాపు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా.. .జగన్ మీడియా సాక్షి వేసిన కథనాలు తీవ్ర కలకలాన్ని రేపాయి. అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు భూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆ కథనంలో ఆధారాలతో సహా, ఏ మంత్రి ఎంత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వివరించారు.

చంద్రబాబు నాయుడు నైతికత గురించి దేశం మొత్తం తెలుసు. అతడికి తెలిసినంత రాజకీయం ఎవరికి తెలియదు అని అందరికి తెలుసు. అవకాశాలను ఎలా మార్చుకోవాలో.. అవరోధాలను ఎలా దాటాలో బాబుగారికి తెలిసినంత ఎవరికీ తెలియదు. ఇక చంద్రబాబు గారు ఎప్పుడూ గురువింద నీతులు వల్లిస్తుంటారు. కేవలం రెండు ఎకరాల భూమి ఉన్న మామూలు వ్యక్తి ఇప్పుడు కోట్ల రూపాయలకు ఎలా అధిపతి అయ్యాడో అందరికి తెలిసిన రహస్యం. హెరిటేజ్ పేరుతో చేస్తున్న వ్యాపారానికి లాభాల పంట ఎలా పండుతోంది అంటే సమాధానం రావాలి. అయితే చంద్రబాబు నాయుడు వీటన్నింటిని ఎలా మ్యానేజ్ చేస్తున్నాడు అంటే మాత్రం ఆయనగారి మేనేజ్ మెంట్ స్కిల్ అనే చెప్పుకోవాలి.

కొన్ని మీడియా ఛానల్స్ ను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇక నమ్మిన బంటు రామోజీరావు ఉండనే ఉన్నాడు. ఎప్పుడూ మీడియా మేనేజ్ మెంట్ చేసే చంద్రబాబు నాయుడుకు జగన్ మీడియా సంస్థ నుండి చిక్కులు వచ్చిపడ్డాయి. మొన్నటి దాకా నారాయణ, కామినేని శ్రీనివాస్ లాంటి పేర్లు కూడా చాలా మందికి తెలియదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వీరి ప్రాభవమే లేదు. కానీ ఎన్నికల్లో గెలిచారు... మంత్రి పదవులు కూడా అందిపుచ్చుకున్నారు. మరి ఇదంతా లక్ష్మీ కటాక్షం లేకుండా జరిగింది అంటే ఎంత మంది నమ్ముతారు. అయినా నిప్పైనా తుప్పైనా.. నిజాలు మాత్రం వెలుగులోకి రావాలి.


చిన్నప్పుడు జానీ.. జానీ అనే పాటను వినే ఉంటారు. కానీ దాన్ని మన చంద్రబాబు నాయుడుకు అన్వయిస్తే ఎలా ఉంటుందో సాక్షి కథనాలు వెల్లడిస్తున్నాయి.

బాబు బాబు.. యస్ పప్పా
ఈటింగ్ ల్యాండ్స్.. నో పప్పా
ఆన్సర్ సాక్షి... హ హ హ


చంద్రబాబు నాయుడు ప్రతిసారి చెప్పే ఓ మాట ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తే నా మీద ఎన్నో కేసులు పెట్టినా కానీ ఒక్క ఆరోపణ నిరూపించలేదు. నేను నిప్పును.. నేను అవినీతికి వ్యతిరేకం అని అంటారు. తాజాగా మాత్రం చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోని గౌరవ మంత్రులు, వారి అనుయాయులుగా చేసిన భూమాయ గురించి చంద్రబాబు నాయుడు జీవితంలోనే మాయని మచ్చగా నిలుస్తాయి. సక్షి పత్రిక కొన్ని ఆధారలతో సహా ఏ మంత్రి ఎన్ని ఎకరాల భూమిని నొక్కే:శారో కథనాన్ని ప్రచురించింది.చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో కీలకంగా ఉన్న  మంత్రి నారాచణ భూబాగోతాన్ని సాక్షి తన కథనంలో వివరించింది. అమరావతి భూముల సేకరణ బాధ్యతను మొత్తం నారాయణ ఒంటరిగా నిర్వహించారు.

అయితే నారాయణ దాదాపు మూడు వేల ఎకరాలకు పైగా భూమిని సొంతం చేసుకున్నట్లు కథనాన్ని ప్రచురించింది. అయితే ఇక్కడే ఓ విషయాన్ని గమనించాలి. నిప్పులేనిదే పొగరాదు. అయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించి ఉంటే ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని నిరూపిస్తే ప్రజల్లో చంద్రబాబు నాయుడు మీద మరింత నమ్మకం పెరుగుతుంది కదా. బంగారం నిప్పులో పడితేనే కదా.. సాగే గుణం వస్తుంది.. అలాగే శుద్ది కూడా అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మొత్తం వ్యవహారం మీద నిజాయితీగా ఎంక్వైరీకి ఆదేశించలేకపోతున్నారు అన్నది ప్రశ్న.

వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా తనను ఏమీచెయ్యలేకపొయాడు అని బీరాలు పలికే చంద్రబాబు వైయస్ తనయుడు జగన్ దెబ్బకు మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకే ఒక్క కథనం చంద్రబాబు అండ్ కో కు చమటలు పట్టిస్తోంది. సాక్షి కథనం మీద చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు కూడా విడ్డూరంగా ఉంది. అమరావతి బ్రాండ్ ను డ్యామేజ్ చేసేందుకే సాక్షి మీడియా, జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజానికి భూదోపిడి జరిగిందా..? జరిగితే దానికి బాధ్యుల మీద చర్యలకు ఉపక్రమించాలే తప్ప ఇలా మాట మార్చడం ఎంత వరకు సబబో చంద్రబాబుగారికే తెలియాలి.

‘‘తాము భూములు కొనుక్కోకూడదా? ఆస్తులు సంపాదించుకోకూడదా? అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. భూములు కొంటే తప్పేమిటని నిలదీశారు. భూముల కొనుగోళ్లలో అవినీతి చోటుచేసుకుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన గురువారం విజయవాడలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి భూముల వ్యవహారంపై విచారణ ఎందుకు? దానికోసం ఢిల్లీ నుంచి సీబీఐ వాళ్లను తీసుకొచ్చి విచారణ చేయించాలా? అని వ్యాఖ్యానించారు. తప్పు చేస్తే తాట తీస్తానని చెప్పారు. ‘సాక్షి’ కథనాలతో వ్యక్తులుగా డామేజ్ అయ్యామని, అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది’’ అన్నారు. అయినా జరిగిన దాని మీద నిజాలు ఇవి అని.. సర్వే నెంబర్లతో సహా వెల్లడించాల్సిన అవసరం ఉన్నా ఆ ఊసెత్తకుండా కేవలం మీడియా మీద మండిపడితే ప్రయోజనం ఏమీ ఉండదు అని చంద్రబాబు నాయుడు గమనించాలి.

అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం కూడా ఉంది. సాక్షి మీడియా ఈ టైంలో ఎందుకు ఈ కథనాన్ని ప్రచురించింది...? వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరడానికి క్యు కట్టిన సమయంలో జగన్ రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడింది. అందుకే జగన్ తన మీడియా బ్రహ్మాస్త్రాన్ని సందించారు. ఏపి ప్రజలకు రాజధాని నిర్మాణం ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యం అని గట్టిగా నమ్మారు.. కాబట్టే మెజార్టీ అందించి.. ప్రభుత్వం ఏర్పాటుకు రాచబాటలు వేశారు. అయితే జగన్ దీని మీదే గట్టి దెబ్బ కొట్టారు. ఏ విషయంలో చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మారో.. అదే నమ్మకాన్ని బాబు నిలబెట్టుకోలేపోతున్నారని జగన్ మీడియా చూపించే ప్రయత్నాలు చూపించారు. దీనిని చంద్రబాబు నాయుడు ఎలా సమర్థవంతంగా ఎదురిస్తారో చూడాలి మరి.


సాక్షి కథనం ప్రకారం...
మంత్రి నారాయణ భూముల విలువ...
*కొనుగోలు 3,129 ఎకరాలు
• చెల్లించినది 432 కోట్లు
• ప్రస్తుత విలువ 10,000 కోట్లకు పైగా...

పయ్యావుల వాటా....
• కొనుగోలు 4.09 ఎకరాలు
• చెల్లించినది 12.27 లక్షలు
• ప్రస్తుత విలువ 8 కోట్లు

ధూళిపాళ్ల  నరేంద్ర వాటా...
• అనధికారికంగా కొట్టేసింది 50 ఎకరాలు
• రిజిస్ట్రేషన్ చేయించుకుంది 3.89 ఎకరాలు

కొమ్మాలపాటి వాటా...
• కొనుగోలు 42 ఎకరాలు
• చెల్లించినది రూ. 1.26 కోట్లు
• ప్రస్తుత విలువ: రూ. 210 కోట్లు

కోడెల తనయుడా కోడెల శివరామకృష్ణ
• కొనుగోలు 17.3 ఎకరాలు
• చెల్లించినది రూ. 93 లక్షలు
• ప్రస్తుత విలువ 18.4 కోట్లు

నారా లొకేష్ వాటా..
* అగ్రిగోల్డ్ హాయ్ ల్యాండ్
*విలువ 425 కోట్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  sakshi  Amaravati  Lands  AP  jagan  jaganmohan reddy  YSRCP  

Other Articles