TRS leader B Rammohan elected Mayor

Trs leader b rammohan elected mayor

GHMC, GHMC Mayor, Hyderabad, TRS, Bonthu Rammohan

TRS youth wing leader B Rammohan was today elected unopposed as Mayor of Greater Hyderabad Municipal Corporation (GHMC). Rammohan was declared elected as Mayor by Hyderabad Collector and presiding officer Rahul Bojja at a meeting of the newly elected corporators of GHMC

ఏకగ్రీవంగా మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక

Posted: 02/11/2016 03:46 PM IST
Trs leader b rammohan elected mayor

హైదరాబాద్ నగర మేయర్‌గా బొంతు రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ జీహెచ్‌ఎంసీ కమిటీ హాల్‌లో జరిగిన సమావేశంలో కొత్త కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మేయర్ ఎన్నిక చేపట్టారు. మేయర్‌గా బొంతు రామ్మోహన్ పేరును కార్పొరేటర్ మన్నె కవిత ప్రతిపాదించారు. ఆమె ప్రతిపాదనను మీర్‌పేట్ కార్పొరేటర్ అంజయ్య బలపరిచారు. వేరే పేర్లు ప్రతిపాదనకు రాకపోవడంతో రామ్మోహన్ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు.

డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ పేరును అమీర్‌పేట కార్పొరేటర్ శేషు కుమారి ప్రతిపాదించారు. రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు. డిప్యూటీ మేయర్‌గా మరో పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో ఫసియుద్దీన్ ఏకగ్రీవంగా డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికైనట్టు ప్రకటించారు. ఇరువురికి ఎంఐఎం కూడా మద్దతు తెలిపింది. మొత్తానికి కేకే కూతురు మేయర్ గా ప్రచారం జరిగినా కానీ కేటీఆర్, కేసీఆర్ లు ఇద్దరూ కలిసి బొంతు రామ్మోహన్ ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి మేయర్ గా సెలక్ట్ చేశారు.మేయర్ గా ఎన్నికైన తర్వాత బొంతు రామ్మోహన్, ఫజియుద్దీన్ లు సిఎం కేసీఆర్ ను కలిశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  GHMC Mayor  Hyderabad  TRS  Bonthu Rammohan  

Other Articles