Dancing deputy jailer' of Salem prison suspended

Dancing deputy jailer of salem prison suspended

Dancing deputy jailer, Tamilnadu, Chennai, Salem

58-year-old Shankaran, deputy jailer, Attur sub jail, Salem district, Republic Day parade, Dance

ITEMVIDEOS: జైలర్ డ్యాన్స్ హిట్... కానీ సస్పెండ్ అయ్యాడు

Posted: 02/11/2016 03:40 PM IST
Dancing deputy jailer of salem prison suspended

ఆనందం ఎక్కువైతే ఎవరూ తట్టుకోలేరు... అలాగే పాపం ఓ జైల్ సూపరెండెంట్ గారు ఆనందంలో డ్యాన్స్ చేస్తే అంత పాపానికి సస్పెండ్ కావాల్సి వచ్చింది. అవును డ్యాన్స్ చేస్తే అంత మాత్రానికే సస్పెండ్ చేస్తారా అని అనుకుంటున్నారా..? అయ్యగారు మామూలుగా కాకుండా డ్రెస్ లో స్టెప్పులేయడంతో సస్పెండ్ కావాల్సి వచ్చింది. ఎక్కడ.. ఎప్పుడు అనే వాటికి సమాధానాలు తర్వాత చూద్దురు కానీ అంతకన్నా ముందు అయ్యగారి డ్యాన్స్ వీడియో చూసితరించండి.


తమిళనాడులోని సాలెం జిల్లా అత్తూర్ సబ్ జైల్ సైపరిండెంట్ శంకరన్ రిపబ్లిక్ పరేడ్ లో పాల్గొన్నారు. అయితే తాను అందులో పాలుపంచుకోవడంతో అయ్యగారికి ఆనందం ఎక్కువైంది. దాంతో ఏం చెయ్యాలో తెలియక.. డ్రమ్స్ కొడుతుంటే.. డ్రెస్ లో ఉన్నాను అన్న ధ్యాస కూడా లేకుండా రెచ్చిపోయి.. డ్యాన్స్ స్టెప్పులేశాడు. అయితే ఎవరో ఓ వ్యక్తి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతొ పాపులర్ అయింది. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ట్సగ్రామ్ లాంటి సోషల్ మీడియా సైట్లలో అయ్యగారి డ్యాన్సింగ్ షో ఫుల్ పాపులర్ అయింది. అయితే డ్రెస్ లో డ్యాన్స్ చేసినందుకు చివరకు సస్పెండ్ అయ్యాడు. పాపం డ్యాన్స్ చేస్తే చేశాడు కానీ ఎవరూ తనను కెమెరాల్లో షూట్ చెయ్యకుండా జాగ్రత్తపడాల్సిందేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dancing deputy jailer  Tamilnadu  Chennai  Salem  

Other Articles