Maganti Gopinath shocked over Errabelli Dayakar joining TRS

No connection with cash for vote scam says maganti gopinath

errabelli dayakar rao, prakash goud, Maganti Gopinath,ghmc tdp president, tdlp, errabelli dhayakar rao, trs, harish rao, kcr, cash for vote scam, mla stephenson, revanth reddy, acb, notices to gopinath, arrest, telangana tdp, trs, telangana tdp strength, telangana tdp mlas, chandrababu naidu, nara lokesh, chandrashekar rao

Greater Hyderabad TDP president and Jubilee Hills MLA Maganti Gopinath expressed shock over TDLP president Errabelli Dhayakar Rao’s joining TRS party.

అ కేసుతో తనకు సంబందం లేదంటున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే..!

Posted: 02/11/2016 04:44 PM IST
No connection with cash for vote scam says maganti gopinath

ఓటుకు నోటు కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని టీడీపీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఏసీబీ నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదని మీడియాతో చెప్పారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన డబ్బును మాగంటి గోపినాథ్ నుండే తీసుకువచ్చారన్న సమాచరంతో ఆయనను అరెస్టు చేసేందుకు రంగం సిద్దమైందన్నవార్తల నేపత్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఓటుకు నోటు కేసులో ఎలాంటి ప్రమేయం, సంబందం లేదని తేల్చి చెప్పారు.

ఈ కేసులో తన పాత్ర ఉందని తేలితే...రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన తరువాత జరిగిన విచారణ సందర్భంగా తనను ఎందుకు అరెస్టు చేయలేదని గోపీనాథ్ ప్రశ్నించారు. తాను తప్పు చేసి ఉంటే కనుక ఎప్పుడో చర్యలు తీసుకుని ఉండేవారని అన్నారు. తనను పార్టీ మారమని ప్రోత్సహించారని, తాను టీడీపీతోనే ఉంటానని తేల్చిచెప్పడంతో తనపై లేనిపోని ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని, తద్వారా తనను ఒత్తిడిలోకి నెట్టి పార్టీ మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారాలకు బెదిరిపోయే మనిషిని కాదని, టీఆర్ఎస్ వ్యూహాలను ఎదుర్కొనే సామర్థ్యం తనకు ఉందని ఆయన చెప్పారు.

ఎర్రబెల్లి దయాకరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరడం తనకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ఎర్రబెల్లి తనకు మంచి మిత్రుడని, తామంతా కలిసి పోరాటం చేశామని గుర్తుచేశారు. టీఆర్ఎస్ లో చేరుతున్నారని వచ్చిన వార్తలపై ఆయన ఆచితూచి స్పందించారు. టీఆర్ఎస్ నుంచి తనకు ఎటువంటి ప్రతిపాదన రాలేదని చెప్పారు. తనతో టీఆర్ఎస్ నాయకులు ఎవరూ చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. తాను ఎట్టిపరిస్తితుల్లో టీడీపీలోనే కొనసాగుతానని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maganti gopinath  errabelli dayakar rao  telangana tdp mlas  trs  cash for vote  

Other Articles