Puranalapool result will announce in last

Puranalapool result will announce in last

GHMC, GHMC Poll, GHMC Result, Poll, Greater Hyderabad Results

Elections commission will announcefirst Dattatreya nagar result and last result puranapool

జిహెచ్ఎంసీ చివరి ఫలితం పురానాపూల్

Posted: 02/05/2016 10:34 AM IST
Puranalapool result will announce in last

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో జరిగే ఓట్ల లెక్కింపు అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాత్రి 8 గంటల వరకు గ్రేటర్ ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తి అవుతుంది. మొత్తం 150 డివిజన్లకు సంబంధించి 24 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును చేపడుతున్నారు. ఒక్కో కేంద్రంలో 6 నుంచి 10 డివిజన్ల ఓట్ల లెక్కింపు. ఎన్నికల విధుల్లో 5,626 మంది సిబ్బంది పాల్గొన్నారు. లెక్కింపు కేంద్రాల్లో 1674 టేబుళ్లను ఏర్పాటు చేసిన అధికారులు 827 రౌండ్లను చేపట్టనున్నారు. ఒక్కో రౌండ్‌కు 15 నిమిషాలు కేటాయింపు.

దత్తాత్రేయ నగర్, అక్బర్‌బాగ్. రెయిన్‌బజార్, నవాబ్‌సాహెబ్‌కుంట డివిజన్ల ఫలితాలు మొదటగా వెలువడనున్నాయి. కాగా చివరగా ఫలితాలు వెల్లడయ్యే డివిజన్లు ఈ విధంగా ఉన్నాయి. సరూర్‌నగర్, ఆర్‌కేపురం, చంపాపేట, గడ్డిఅన్నారం, యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, మోండా మార్కెట్, కొత్తపేట. అన్నిటికంటే ఆఖరున వెల్లడయ్యేది పురానాపూల్ డివిజన్ ఫలితం.:జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కానున్న ఫలితాల వెల్లడి.. బహుశా రాత్రి 9 గంటలకు ముగుస్తుందని అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  GHMC Poll  GHMC Result  Poll  Greater Hyderabad Results  

Other Articles