tension in kirlampurdi

Tension in kirlampurdi

Mudragada, Mudragada Padmanabham, Kirlampudi

On MUdragada Hunger strike, tension situation in Gadavari dist. Mudragada started his Hunger strike this morning.

టెన్షన్ టెన్షన్.. కిర్లంపూడిలో టెన్షన్

Posted: 02/05/2016 09:15 AM IST
Tension in kirlampurdi

పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది. అటు ప్రభుత్వం, పోలీసులు ఒకటే టెన్షన్ పడుతున్నారు. ముద్రగడ కాపుల రిజర్వేషన్ల మీద మెట్టు దిగడం లేదు... నిరాహార దీక్షకు సిద్దమయ్యారు. మొన్నటి కాపు గర్జనలో జరిగిన హింసాత్మక ఘటన నేపథ్యంలో నేటి ముద్రగడ నిరవధిక నిరాహార దీక్ష ఎలాంటి పరిస్థితులను కల్పిస్తుందో అని సర్వత్రా టెన్షన్ నెలకొంది. టీడీపీ నాయకులతో ముద్రగడ జరిపిన చర్చలు విఫలం కావడంతొ పరిస్థితి మరింత వేడిని పెంచింది.

కిర్లంపూడి మొత్తం పోలీసుల ఆధీనంలొకి వచ్చేసింది. తున కాపు గర్జన తరహా ఘటనలు జరగకుండా ప్రభుత్వం పూర్తి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కిర్లంపూడికి బయటి వ్యక్తులు ఎవరూ రావద్దు అంటూ ఎస్పీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముద్రగడ కూడా తనను చూడడానికి కూడా రావద్దని ప్రకటించేశారు. తనకు ఎలాంటి భద్రత అక్కర్లేదని.. గాంధేయ మార్గంలో నిరాహార దీక్ష సాగుతుందని కూడా ముద్రగడ వెల్లడించారు. కానీ ప్రభుత్వం మాత్రం ముందు జాగ్రత్తగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేసింది.

తూర్పుగోదావరి జిల్లా అంతటా పోలీసు బలగాలను మొహరించారు. జిల్లా కేంద్రం కాకినాడ సహా కిర్లంపూడి, జగ్గంపేట, పిఠాపురం, తుని, అమలాపురం తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను సిద్ధం చేశారు. జిల్లా మొత్తం మీద సీఆర్‌-పీసీ 144 సెక్షన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. జనం గుంపులు గుంపులుగా తిరగడం, సమావేశం కావడం నిషేధం. పోలీసు చట్టం సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు కూడా అమలు చేస్తున్నారు. ఈ నిషేధాజ్ఞల ప్రకారం ఎలాంటి సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాలన్నా ముందుగా పోలీసుశాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. గడ పద్మనాభం నిరాహార దీక్ష చేయనున్న దృష్ట్యా జిల్లా అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన ఆంక్షలు అమలు చేయబోతున్నామని ఎస్పీ రవిప్రకాశ్ చెప్పారు.

సంఘ విద్రోహశక్తులను ఎక్కడికక్కడ గుర్తించి అడ్డుకొనేందుకు జిల్లావ్యాప్తంగా 39 చెక్‌-పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. కాపు గర్జన సభ తదుపరి విధ్వంసానికి పెట్రోల్, మారణాయుధాలు తెచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరోవైపున 10 కంపెనీల సీఆర్‌-పీఎఫ్, ఐటీబీఎఫ్ బలగాలు జిల్లాకు వచ్చాయి. నాలుగు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. పోలీసుశాఖ నుంచి 5 వేల మంది సిబ్బందిని అదనంగా జిల్లాకు రప్పించారు. జిల్లాకు వచ్చే యాత్రికులు, సాధారణ ప్రజల వద్ద ఉన్న గుర్తింపుకార్డుల ద్వారా అనుమతి ఇస్తామని ఎస్పీ రవిప్రకాశ్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada  Mudragada Padmanabham  Kirlampudi  

Other Articles