TRS released manifesto for the GHMC Elections.

Trs released manifesto for the ghmc elections

TRS, TRS Bhavan, TRS Manifesto, GHMC, GHMC Elections

TRS party released the Manifesto for the Greater Hyderabad Elections. Minister KTR, KK, DS released the manifesto in the TRS Bhavan.

టీఆర్ఎస్ మేనిఫెస్టో ఇదే....

Posted: 01/23/2016 11:48 AM IST
Trs released manifesto for the ghmc elections

జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ వాతావరణం అంతకంతకు వేడెక్కుతోంది. అన్ని పార్టీలు కూడా ఓటర్లను ఆకర్షించేందు రకరకాల ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నాయి. అయితే ఇప్పటికే ప్రచారంలో దూసుకెళుతున్న టీఆర్ఎస్ పార్టీ తాజాగా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోను విడుదల చేసింది. టీఆర్ఎస్ భవన్ లో మంత్రి కేటీఆర్, సీనియర్ నాయకులు కెకె, డి.శ్రీనివాస్ లు ఈ మేనిఫెస్టేను విడుదల చేశారు.  గ్రేటర్ ఎన్నికల్లో ప్రభుత్వం చేసిందే.. చెబుతున్నామని.. మేనిఫెస్టోలో చెప్పినదాని కంటే ఎక్కువే చేస్తామని కేటీఆర్ తెలిపారు.

టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు...

* ఘట్‌కేసర్, శామీర్‌పేట రోడ్ నిర్మాణంతో ఈ ఏడాది చివరికి 158 కి.మీ. ఔటర్ రింగ్‌రోడ్డు పూర్తి
* మూసీనదిపై తూర్పు నుంచి పడమర దిశగా 42 కిలోమీటర్ల మేర 4 లైన్ల రోడ్
* దుర్గం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం
* నిరంతర విద్యుత్ సరఫరాకు భరోసా
* 3,500 కిలోమీటర్ల మురుగునీటి కాల్వను ఆధునీకరణ
* ఎంఎంటీఎస్ రెండోదశ పనులు త్వరలో పూర్తిచేస్తామని హామీ
* హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల కొనుగోలు
* ఉస్మాన్ సాగర్-హిమాయత్ సాగర్‌ల పునరుద్ధరణ
* మూసీ సుందరీకరణ, పునరుద్ధరణకు ప్రాధాన్యత
* ఉచిత వైఫై, రూ. 130 కోట్లతో 200 మార్కెట్లు
* ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో సైక్లింగ్ ప్యాడ్స్
* మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత
* 13 మురికివాడల్లో 17 చోట్ల డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులు ప్రారంభం
* రూ. 5 కే భోజన కేంద్రాలను 200కు పెంపు
* ఉద్యోగ కల్పన, నైపుణ్యాల అభివృద్ధి
* రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సింగిల్ విండో అనుమతి
* రియల్ ఎస్టేట్ సంస్థలపై విధించే నాలా పన్ను ఎత్తివేత
* ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణకు కఠిన నిబంధనలు
* ప్రభుత్వ బడుల విద్యార్థులకు సన్నబియ్యం నాణ్యత పెంపు
* ప్రభుత్వ విద్యార్థులకు డిజిటల్ తరగతులు
* 50 శాతం సబ్సిడీపై మైనార్టీలకు వెయ్యి ఆటోలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  TRS Bhavan  TRS Manifesto  GHMC  GHMC Elections  

Other Articles