Indigo airlines leave passengers and takeoff

Indigo airlines leave passengers and takeoff

Airport, Shamshabad, Indigo flight, Indigo Airlines

Indigo airlines flight in the shamshabad airport, the flight crew clash with some passenger and pilots takeoff form the airport.

ఎయిర్ హోస్టెస్ తో ప్రయాణికుల గొడవ.. వాళ్లను వదిలి వెళ్లిన ఫ్లైట్

Posted: 01/23/2016 11:44 AM IST
Indigo airlines leave passengers and takeoff

విమానయాన సంస్థలు ప్రయాణికులతో వ్యవహరిస్తున్న తీరు చూస్తే నవ్వొస్తోంది. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులను వదిలేసి ఫ్లైట్ టేకాఫ్ తీసుకోవడం ప్రయాణికులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. రాయపూర్ వెళ్లే విమానంలో డెబ్బై మంది పెళ్లి బృందం టిక్కెట్లు బుక్ చేసుకుంది. వారంత కలిసి విమానం ఎక్కారు. విమానం ఎక్కే సమయంలో ఇండిగో సిబ్బంది, ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. దాంతో ఇండిగో సిబ్బంది తీరుకు నిరసనగా విమానం నుంచి ప్రయాణికులు దిగిపోయారు.ప్రయాణికులను వదిలి విమానాన్ని ఎయిర్‌ పోర్టు అధికారులు పంపించేశారు.

కాగా అసలే పెళ్లి బృందం మరి వాళ్లను అలా ఎయిర్ పోర్ట్ లో వదిలివెయ్యడం మీద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ప్రయాణికులు. ఇండిగొ విమానయాన అధికారులతో ప్రయాణికులు గొడవకు దిగారు.. తమను ఇలా వదిలివెళ్లిపోవడం ఏంటని వారు మండిపడ్డారు. అయితే వాళ్ల నిరసనతో ఇండిగో అధికారులు వారి కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. విమానయాన సంస్థలు ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తున్నాయి. గతంలో  కూడా అమెరికా నుండి తిరిగి వచ్చిన తెలుగు విద్యార్థుల వద్ద నుండి టికెట్ డబ్బులు వసూలు చేసేందుకు వారిని కదలకుండా ఎయిర్ పోర్ట్ లోనే కొన్ని గంటల పాటు ఉంచుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indigo Airlines  Airport  Shamshabad  Indigo flight  

Other Articles