President Obama Sing Drakes Hotline Bling

President obama sing drakes hotline bling

Obama, Sings, Hotline bling, Barack Obama, Drakes song

This video shows President Barack Obama “singing” Drake’s “Hotline Bling” for the latest edition of “Baracksdubs,” the YouTube channel that seamlessly edits footage of the leader’s public remarks into popular songs. These are the very same Internet wizards that made it look like Obama is belting out hits such as Taylor Swift’s “Shake It Off” and Mark Ronson’s “Uptown Funk,” featuring Bruno Mars.

ITEMVIDEOS: పాట పాడుతూ.. స్టెప్పులేసిన ఒబామా

Posted: 12/15/2015 03:44 PM IST
President obama sing drakes hotline bling

అవును.. మీరు చదువుతున్నది అక్షరాల నిజం. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనలో అదరగొట్టమే కాకుండా తాజాగా ర్యాప్ పాటకు స్టెప్పులేసి అదరగొడుతున్నారు. మొన్నీమధ్యన బరాక్ ఒబామా భార్య, అమెరికా మొదటి మహిళ మిచెల్ ఒబామా ఓ ర్యాప్ సాంగ్ లో స్టెప్పులేసి అందరికి ఆకట్టుకున్నారు. అయితే మిచెల్ ఒబామా తర్వాత తాజాగా ఇప్పుడు ఒబామా కూడా స్టెప్పులేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలే అమెరికా అధ్యక్షుడు ఒబామా స్టెప్పులేస్తే చూడకుండా ఉంటారా.? అందుకే ఈ వీడియోను అప్ లోడ్ చేసిన ఒక్క రోజులోనే లక్షా ముప్పై వేల లైక్ లు వచ్చాయి. అయినా ఒబామా స్టెప్పులేయడం ఏంటి అనుకుంటున్నారా..?

అసలే టెక్నాలజీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే ఎవరికి ఎంత టాలెంట్ ఉందో నిరూపించుకోవడంలో కొంత మంది ముందుకెళుతున్నారు. అలా కొంత మంది ఒబామా వీడియోను బాగా ఎడిట్ చేసి అప్ లోడ్ చేశారు. హిట్ అయిన ఓ ర్యాప్ సాంగ్ ను తీసుకొని.. ఆ పాట స్టైల్లోనే ఒబామా స్పీచ్ లో మాటలను యాడ్ చేస్తూ.. ఓ పాటను డిజైన్ చేశారు. మొత్తంగా ఒబామానే పాడినట్లు, డ్యాన్స్ చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. దాంతో కొత్త వీడియోకు సోషల్ మీడియాలో స్పీడ్ గా క్రేజ్ పెరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Obama  Sings  Hotline bling  Barack Obama  Drakes song  

Other Articles