bar and restarants to be open upto 1 pm in telangana

Telangana govt new year boon to boozers bar to open upto 1 pm

Telangana government, telangana govt new year boon, kcr boon to boozers, telangana bars to open upto 1am, telangana bars serve liquor upto 12 am, odisha, delhi, chennail, hyderabad, hyderabad bars, no boon for wines shops, Telangana Government, bar and restarant, wine shops, police

Telangana government proposes to gives new year boon to boozers of the state, with bar to open upto 1 pm liquor to be served up to 12

మందుబాబులకు కిక్కుకే కిక్కెనుంది.. న్యూఇయర్ స్పెషల్

Posted: 12/15/2015 12:28 PM IST
Telangana govt new year boon to boozers bar to open upto 1 pm

కొత్త సంవత్సరం నుంచి ముందుబాబులకు శుభవార్త అందించేందుకు తెలంగాణ సర్కార్ సిద్దంగా వుంది. దీంతో ఇక మందుబాబుల కిక్కుకే కిక్కు ఎక్కనుంది. ఇప్పటివరకు పీకల వరకు తాగిన మందుబాబులు తెల్లవారగానే హ్యాంగ్ ఓవర్ పెగులను ఇక రాత్రిల్లోనే తీసుకునే వెసలుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించనున్నట్లు సమాచారం.  రాష్ట్రవ్యాప్తంగా బార్లు ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకూ నడుస్తుండగా, ఆ సమయాన్ని 12 గంటల వరకూ పెంచాలని, ఆహార పదార్థాల విక్రయాలను ఒంటి గంట వరకూ కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం. పర్యాటకపరంగా, పారిశ్రామికంగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్న వేళ మద్యం విక్రయాల సమయాలు కూడా పెంచాలన్న ప్రతిపాదన చాలా రోజులుగా పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునే ఉత్తర్వుల జారీ ఆలస్యమైందని అధికారులు అంటున్నారు.

కాగా, పోలీసుల అభ్యంతరాల మేరకు మద్యం షాపుల సమయాన్ని మాత్రం యథాతథంగా ఉంచనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఫైవ్ స్టార్ హోటళ్లు మినహా మిగతా బార్లన్నింటిలో రాత్రి 11 గంటల వరకూ మద్యం అందుబాటులో ఉంది. ముంబైలో రాత్రి 1:30 వరకు, ఢిల్లీలో రాత్రి 12:30 వరకూ, చెన్నైలో రాత్రి 12 వరకు, ఒడిశాలో రాత్రి 1:30 గంటల వరకూ బార్లు తెరచివున్నందున ఇక్కడ కూడా సమయం పెంచాలని, తద్వారా మరింత ఆదాయం ఖజానాకు చేర్చవచ్చన్నది తెలంగాణ సర్కారు ఆలోచనగా తెలుస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Government  bar and restarant  wine shops  police  

Other Articles