MLA Sayanna, MLC Prabhakar joins TRS

Trs operation akarsh attacts ttdp mla sayanna congress mlc prabhakar

cantonment mla sayanna, Congress MLC Prabhakar, TRS operation akarsh, MLA Saayanna TRS, MLC Prabhakar MLA Saayanna joins TRS, TDP leaders joins TRS, TRS aims GHMC elections, Telangana news

TDP MLA Sayanna and MLC Prabhakar had officially declared to join TRS party and MLA Prakash Goud decision is awaiting.

టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న సాయన్న.. ప్రభాకర్

Posted: 12/03/2015 11:24 AM IST
Trs operation akarsh attacts ttdp mla sayanna congress mlc prabhakar

టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి ఊపందుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు మరోమారు షాక్ తగిలింది. అధికార టీఆర్ఎస్ లోకి భారీ వలసలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇద్దరు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు కారు ఎక్కే అవకాశం కనిపిస్తుంది. ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రకాష్ గౌడ్ లతో కలసి నలుగురు ఎమ్మెల్సీలు కూడా భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి. స్వయంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు వారిని క్యాంపు కార్యాలయంలోకి తీసుకెళ్లి.. కేసీఆర్ తో భేటీ ఏర్పాటు చేయించారని కూడా వార్తలు వచ్చాయి.

కాగా ఈ వార్తలను నిజం చేస్తూ.. ఇవాళ టీడీపీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ లు కారు ఎక్కుతున్నట్లు ప్రకటిచారు. మెడలో గులాబి కండువాతో వచ్చిన నేతలు తాము అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రభాకర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడిన సాయన్న పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తనకు ఏనాడూ అన్యాయం చేయలేదని ఆయన పేర్కొన్నారు. టీడీపీని వీడటం తనకు బాధగానే వుందన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నామని....ఆయన తమను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు .సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తనను విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పారు. పార్టీల కంటే తన నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని చెప్పారు. సాధారణ ప్రజల కోసం కంటోన్మెంట్ లోని ఆర్మీ రోడ్లను తెరిపించడంలో సీఎం కేసీఆర్ కీలక భూమిక పోషించారన్నారు. ఈ కారణంగానే కేసీఆర్ కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామిగా మారాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ లో చేరానని ఆయన ప్రకటించారు.

కాగా తాను కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసినా.. తనకు పార్టీలో తగిన గుర్తింపు రావడం లేదని ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం పార్టీని సంసిద్దం చేయాలని తాను ఎంతగానో చెప్పినా.. పార్టీ పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఇక తనకు.. తన అనుయాయువులకు కాంగ్రెస్ పార్టీలో మనుగడ కష్టమని భావించి.. బంగారు తెలంగాణ దిశగా కష్టపడి పనిచేస్తున్న కేసీఆర్ నిజాయితీ, నిబద్దతలు నచ్చి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రభాకర్ తెలిపారు.
 
. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA Saayanna TRS  MLC Prabhakar  TRS  Telangana news  

Other Articles