peethala sujatha jana chaitanya yatra in jangareddygudem

Minister security losses balance after running 5 kms

peethala sujatha, cycle rally, police, jana chaitanya yatra, gun man, minister peethala sujatha, peethala sujatha jana chaitanya yatra, peethala sujatha jangareddygudem, peethala sujatha security staff,

Andhra Pradesh minister peethala sujatha security staff losses balance after running 5 kms behing her in jana chaitanya yatra in jangareddygudem

మంత్రి పీతల యాత్ర.. ఇబ్బంది పడిన భద్రతా సిబ్బంది

Posted: 12/03/2015 01:23 PM IST
Minister security losses balance after running 5 kms

ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత మరోమారు వార్దల్లో వ్యక్తిగా మారారు. జన చైతన్యయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బెల్లెట్ నడపడంతో.. దానిని చూసి స్పూర్తి పోందిందేమో తెలియదు కానీ.. అమాత్యులు కూడా మోటార్ సైకిల్ నడపాలని పూనుకున్నారు. అయితే అమెకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా భద్రంగా చూసుకోవాల్సిన భధ్రతా సిబ్బంది మాత్రం ఇబ్బందిగా మారింది. ఎందుకంటారా..? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మంత్రి పీతల సుజాత స్థానికంగా నిర్వహించిన జన చైతన్యయాత్రలో పాల్గొన్నారు. నిత్యం రద్దీగా వుండే రోడ్డుపై ట్రాఫిక్ ను నియంత్రించిన పోలీసులు.. స్థానిక బైపాస్‌ రోడ్డు జంక్షన్ ఎన్టీఆర్ విగ్రహం నుంచి పొట్టి శ్రీరాములు జంక్షన్, పాతబస్టాండ్, గంగానమ్మ గుడిసెంటర్, కొత్తబస్టాండ్, బోసుబొమ్మసెంటర్, జేపీ సెంటర్ వరకు ఐదు కిలోమీటర్లు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
 
ఈ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సుజాత స్కూటర్ నడిపారు. మంత్రి వెంట ఇద్దరు గన్‌మన్‌లు, జంగారెడ్డిగూడెం ఎస్సై ఆనందరెడ్డి, ఇతర పోలీసులు సుమారు ఐదు కిలోమీటర్లు పరిగెత్తడానికి నానా అవస్థలు పడ్డారు. స్థానిక ఏలూరు రోడ్డులోకి వచ్చేసరికి మంత్రి గన్‌మన్ గంగాధర్ పరిగెడుతూ తూలి పడిపోయారు. వెనుక వచ్చిన మోటార్ సైకిళ్లను కంట్రోల్ చేయడంతో ఆయనకు ప్రమాదం తప్పింది.  కొద్దిసేపు విశ్రాంతి అనంతరం ఆయన మళ్లీ ర్యాలీలో పాల్గొన్నారు.

 మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : peethala sujatha  cycle rally  police  jana chaitanya yatra  gun man  

Other Articles