Countries around the globe light up monuments in solidarity with Paris

Paris attacks localites pays tribute

Attack,London,Paris Attacks,Rio de Janeiro,Stockholm,Sydney,Tehran,paris,tribure,isis attacks,sorrow,solidarity,France,light up monuments, solidarity with Paris

People around the world showed their sorrow and solidarity with France on Saturday in the wake of the Paris attacks.

పారిస్ ఉగ్రదాడి మృతులకు ప్రపంచవ్యాప్తంగా వెల్లివిరిసిన సంతాపం

Posted: 11/15/2015 10:18 AM IST
Paris attacks localites pays tribute

పారిస్ మహానగరంలో ఉగ్రదాడి మోగించిన మరణమృదంగంతో ఎక్కడ చూసిని శ్మశాన వాతావరణం అలుముకుంది. పారిస్ వ్యాప్తంగా భీతావహ వాతవరణం నెలకొనగా, అక్కడి ప్రజల్లో ఇంకా గుండెల్లో ఎక్కడో ఓ మూల భయాందోళన పోంచివుంది. మరిన్నీ దాడులు జరుగుతాయన్న అనుమానాల నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దులన్నింటినీ మూసివేసిన ఫ్రాన్సు దేశంలో అత్యవసర పరిస్థితి విధించింది, మూడు రోజులు సంతాప దినాలను  ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడ చూసినా విషన్నవదనాలు, శోకతప్త హృదయులైన పౌరులే కనబడ్డారు. ముష్కరమూకల భీకరదాడిలో అసువులు బాసిన తమ బంధువులు, సన్నిహితులకు పారిస్ ప్రజలు రంగురంగుల కొవ్వోత్తులు వెలిగించి నివాళులర్పిస్తున్నారు. దాడుల్లో నష్టపోయినా, గాయపడినా, వెన్ను చూపేదిలేదనే సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. నిబ్బరంగా, ధైర్యంగా ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఎదుర్కొని తీరతామంటున్నారు.

అటు ప్రపంచ దేశాలన్నీ పారిస్ మారణహోమాన్ని తీవ్రంగా ఖండించాయి. ఈ దారుణ మారణఖాండలో అసువులు బాసిన వీరులకు ప్రపంచ దేశాలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపాయి. వారి కుటుంబసభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశాయి. మరోవైపు పారిస్‌లో నరమేధానికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్, సిరియా) ప్రకటించుకున్నది.  పారిస్ దాడికి ఒకరోజు ముందు ఫ్రాన్స్‌ను హెచ్చరిస్తూ ఐఎస్‌ఐఎస్ విదేశీ మీడియా విభాగం అల్ హయత్ మీడియా సెంటర్ ఓ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. సిరియాలో దాడులు ఆపకపోతే.. మిమ్మల్ని ప్రశాంతంగా బతుకనివ్వమనే హెచ్చరికలు జారీ చేసింది.  దీనికి సంబంధించి అరబిక్ భాషలో ఓ  వీడియోను పోస్ట్ చేసింది.  పారిస్ దాడికి ఒకరోజు ముందు ఆ వీడియో విడుదల చేయడం.. దాడికి పాల్పడింది తామేనని ఐఎస్‌ఐఎస్ ప్రకటించడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : paris attack  tribute  isis attacks  france  

Other Articles