inauguration of TN women congress cell in satyamoorthy bhavan by nagma

Tamilnadu congress leaders invited nagma to satyamurty bhavan

tamilnadu women congress leaders, all india womens congress general secratary nagma, inauguration, inauguration of women's cell in satyamurty bhavan, nagma to inaugurate women cell in TN, vijaya Tharani, sathyamoorthy bhavan, nagma, congress, tamilanadu

tamilnadu women congress leaders are inviting all india womens congress general secratary nagma to inauguration of women's cell in satyamurty bhavan

నగుమోము నగ్మా ముఖం వెలిగిపోయింది.. ఎందుకు..?

Posted: 10/20/2015 08:21 PM IST
Tamilnadu congress leaders invited nagma to satyamurty bhavan

ప్రకటించిన కార్యక్రమాలు వాయిదా పడటంతో చేదు అనుభవాన్ని ఎదుర్కన్న అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నగ్మా మోము వెలిగిపోతోంది. దీనికి కారణం పొగోట్టకున్న చోటే.. అమె తిరిగి తన పరువు మర్యాదాలను కాపాడుకోవడం. అదేంటి అంటారా.. ఈ నెల 16వ తేదీన చెన్నై చేరుకున్న నగ్మా.. ఆ రోజున ఆమె సత్యమూర్తి భవన్‌లో విలేకరులను కలుసుకోనున్నట్టు ప్రకటించారు. అయితే ఆఖరి క్షణంలో ఆమె సత్యమూర్తి భవన్ కార్యక్రమాన్ని రద్దు అయింది. 16న విమానాశ్రయానికి చేరుకున్న నగ్మాకు ఆహ్వానం పలకడంలోనూ కలకలం చెలరేగింది. మహిళా కాంగ్రెస్ ఆధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయధరణి తరపున ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నిర్వాహకులు పాల్గొన్నారు. దీంతో చిరెత్తుకోచ్చిన నగ్మా.. మరుసటి రోజు తూత్తుకుడిలో జరిగిన కాంగ్రెస్ మండల మహానాడులో పాల్గొనే కార్యక్రమాని చివరి నిమిషంలో రద్దు చేసుకుని స్థానిక నేతలకు షాక్ ఇచ్చారు.

దీంతో పరాభావం పాలైనట్లు భావించిన నగ్మాను.. చివరకు తమిళనాడు మహిళా కాంగ్రెస్ నేతలు ఈ నెల 22వ తేదీన సత్యమూర్తి భవన్‌కు ఆహ్వానించేందుకు నిర్వాహకులు నిర్ణయించారు. దీని పై రాష్ట్ర మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలు విజయతారణి మాట్లాడుతూ గత 4 వ తేదీ నుంచి తాను నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నానని, నగ్మా వచ్చిన రోజున చెన్నైలో లేనందున ఆహ్వానించడానికి వీలు కాలేదన్నారు. దీంతో నిర్వాహకులను పంపినట్లు తెలిపారు. 22 వ తేదీ విజయదశమి రోజున సత్యమూర్తి భవన్‌లో మహిళా కాంగ్రెస్ భవనం ప్రారంభోత్సవం జరగనుందని, ఈ కార్యక్రమానికి నగ్మా, కుష్బూలను ఆహ్వానించామన్నారు. కార్యక్రమంలో నెహ్రూ 125 వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన సంస్మరణ లేఖ విడుదల కార్యక్రమం జరుగనుందన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagma  congress  tamilanadu  

Other Articles