AP capital amaravati will be the number one

Ap capital amaravati will be the number one

Ap, capital, Amaravati, Amaravathi News, Chandrababu Naidu, Chanadrababui naidu on Amaravati

AP capital Amaravati will be the number one in the world. Chandrababu Naidu hope to best in the world. He said that the officals gather water and sand.

రానున్న కాలంలో అమరావతి నెంబర్ వన్

Posted: 10/20/2015 04:51 PM IST
Ap capital amaravati will be the number one

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల త్యాగ్యాన్ని ఏపీ ప్రజలు ఎన్నడూ మరువరని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని కోసం 33వేల ఎకరాల భూములు ఇచ్చి చరిత్ర సృష్టించారని ఆయన ప్రశంసించారు. రాజధాని నిర్మాణంలో భాగంగా దేశంలోని పలు పుణ్యక్షేత్రాలతో పాటు రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి సేకరించిన మట్టి, నీటికి ఆచార్య నాగార్జున వర్సిటీలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు చినరాజప్ప, యనమల, నారాయణ, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచంలోని సుందరమైన నగరాల్లో అమరావతి మేటిగా నిలవాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేందుకే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కేవలం వారం రోజుల్లోనే మట్టి, నీటిని సేకరించామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి గొప్ప చరిత్ర కలిగిన ప్రాంతమం అన్న ఆయన... లండన్ మ్యూజియంలో అమరావతి గ్యాలరీ ఉండటం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని ఓ మహోత్సవంగా నిర్వహిస్తున్నట్లు సీఎం వివరించారు. మట్టి, పవిత్ర జలాలను శంకుస్థాపన రోజు హెలికాప్టర్ ద్వారా సీఆర్ డీఏ పరిధిలో చల్లుతామని సీఎం వెల్లడించారు. దసరాతోపాటే మనకు అమరావతి శంకుస్థాపన పండగ వచ్చిందన్న ముఖ్యమంత్రి.. విజయదశమి రోజు ఏ పని చేసినా విజయం సిద్ధిస్తుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  capital  Amaravati  Amaravathi News  Chandrababu Naidu  Chanadrababui naidu on Amaravati  

Other Articles