Nara Lokesh warned to YS Jagan

Nara lokesh warned to ys jagan

Nara Lokesh, Jagan, Guntur, TDP, Special Status, Protest

Nara Lokesh warned to YS Jagan. NaraLokesh gave warning to YS Jagan. In Guntur Protest if any violence happen, Jagan has to go jail for that.

ITEMVIDEOS: ఒక్క అద్దం పగిలినా జగన్ జైలుకే

Posted: 10/07/2015 08:03 AM IST
Nara lokesh warned to ys jagan

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మాటల తూటాలు పేల్చారు. వైయస్ జగన్ టార్గెట్ గా చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుడుగా దొంగబ్బాయి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని అన్నారు.  వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు 5.70 లక్షల ఎకరాల భూములను రైతుల వద్ద నుంచి సేకరించారని.. కనీసం ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదని అన్నారు.  పట్టిసీమ ప్రాజెక్టు, రాజధాని, బందర్‌ పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టులను  జగన్‌ వ్యతిరేకిస్తున్నాడు. అధికారంలోకి వస్తే భూములు తిరిగి ఇచ్చేస్తానని రెచ్చగొడుతున్నారు. ఆయన మాత్రం బెంగళూరులో 32 ఎకరాల్లో ఇల్లు కట్టుకొన్నాడు కానీ... ఐదు కోట్ల మంది ప్రజలకు 33 వేల ఎకరాల్లో రాజధాని అవసరం లేదన్నట్లుగా మాట్లాడుతుండటం ఏం నీతి అని లోకేశ్‌ ప్రశ్నించారు.

ఇక జగన్ ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ చేపడుతున్న దీక్ష మీద కూడా లోకేష్ స్పందించారు. జగన్ ఈసారి ఏమైనా తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టమని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. గుంటూరులో తలపెట్టిన దీక్షకు మద్దతుగా రాష్ట్రమంతటా బస్సులు తగులబెడదాం. కలెక్టర్‌ ఆఫీసులు ధ్వంసం చేద్దాం. ఆత్మహత్యలకు ప్రేరేపిద్దాం అంటూ వైసీపీ నాయకులు కొన్నిరోజులుగా సోషల్‌మీడియాలో ప్రకటనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్లకి నేను ఒక్కటే చెబుతున్నా. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క కార్యాలయ అద్దం పగిలినా... ఒక్క యువకుడి బలవన్మరణం జరిగినా... అందుకు జగన్‌నే బాధ్యున్ని చేసి... కేసులో ఆయన్ను ఏ-1గా చేర్చేంత వరకూ పోరాడతాం. మాకు మీ లాగా దొంగ పేపర్‌, ఛానల్‌ లేదు. 55 లక్షల మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మా వాళ్లు తెరిస్తే నువ్వు తట్టుకోలేవు అని లోకేశ్‌ తీవ్రంగా హెచ్చరించారు. నిండా మునిగినోడికి చలి తెలియదన్నట్లుగా 40వేల కోట్ల అవినీతిలో కూరుకుపోయి దానిని అందరికీ రుద్ధాలని చూడటం జగన్‌కే చెల్లిందన్నారు. సింగపూర్‌లో తమకు ఆస్తులున్నాయని ఆరోపణలు చేస్తున్న దొంగబ్బాయి, ఆయన వెనక ఉన్న దొంగలు కనీసం ఒక్క ఆధారం చూపినా రాజకీయాలను వదిలేస్తానని సవాలు విసిరారు. మొత్తానికి నారా లోకేష్ జగన్ ను తిడుతూ కార్యకర్తల్లో మంచి ఉత్సాహాన్ని నింపారు. మరి జగన్ దీని స్పందిస్తారో లేదో...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Lokesh  Jagan  Guntur  TDP  Special Status  Protest  

Other Articles