The Nobel Prize in Physics 2015 recognises Takaaki Kajita in Japan and Arthur B. McDonald in Canada | Nobel Prize

Nobel prize in physics 2015 takaaki kajita in japan arthur b mcdonald in canada

nobel prize news, nobel prize winners, nobel prize 2015 winners, nobel prize in medicines, nobel prize in physics

Nobel Prize in Physics 2015 Takaaki Kajita in Japan Arthur B. McDonald in Canada : The Nobel Prize in Physics 2015 recognises Takaaki Kajita in Japan and Arthur B. McDonald in Canada, for their key contributions to the experiments which demonstrated that neutrinos change identities.

నోబెల్ పురస్కారాలు పొందిన పరిశోధకులు వీళ్లే!

Posted: 10/06/2015 07:17 PM IST
Nobel prize in physics 2015 takaaki kajita in japan arthur b mcdonald in canada

ప్రపంచంలోకెల్లా అత్యంత మహా పురస్కారంగా పరిగణించబడే ‘నోబెల్’ పురస్కారం.. 2015వ సంవత్సరానికిగానూ భౌతికశాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు దక్కింది. క్వాంటమ్ మెకానిక్స్ లో పరిశోధనలను మరింత ముందుకు తీసుకుపోయేలా.. న్యూట్రినోలకూ ద్రవ్యరాశి ఉంటుందని రుజువుచేసిన ఈ ఇద్దరి భౌతికశాస్త్రవేత్తలకి ఆ ప్రైజ్ దక్కింది.

జపాన్ కు చెందిన టకాకి కజితా, కెనడాకు చెందిన మెక్ డోనాల్డ్ లను సంయుక్తంగా అవార్డుకు ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ మంగళవారం ప్రకటించింది. మూలకణంలో ఎలక్ట్రాన్లను పోలి ఉండే న్యూట్రినోల పనితీరుపై ఈ ఇరువురు పరిశోధనలు చేశారు. టకాకి.. యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందినవారుకాగా, మెక్ డోనాల్డ్ కెనడాలోని సడ్బ్యూరీ న్యూట్రినో అబ్జర్వేటరీ ఇన్ స్టిట్యూట్ కు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ అత్యున్నత పురస్కారం తమకు లభించినందుకు వారిద్దరు ఆనందం వ్యక్తం చేసినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదిలావుండగా.. ఈ ఏడాది తొలి నోబెల్ పురస్కారం మెడిసిన్ విభాగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే! మలేరియా క్యూరింగ్ పై పరిశోధనలు జరిపినందుకు గాను విలియమ్ సి. క్యాంప్ బెల్, సతోషి ఓమురా, యోయూ తూ అను శాస్త్రవేత్తలకు ఆ పురస్కారం లభించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nobel prize 2015  physics nobel prize  medicine nobel prize  

Other Articles