YS Jagan committe to do protest at Guntur

Ys jagan committe to do protest at guntur

Jagan, AP, Special Status, Police, Guntur, YSRCP, Jagan Protest

YS Jagan committe to do protest at Guntur. Police didnt give permission to do protest at Guntur. But YSRCP party leaders arranging all facilities to do protest

జగన్ ఓ సీతయ్య ఎవరి మాటా వినడు

Posted: 10/07/2015 08:04 AM IST
Ys jagan committe to do protest at guntur

వైయస్ జగన్ గుంటూరులో చేపడుతున్న దీక్ష మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలీసులు అనుమతినిరాకరించినా జగన్ మాత్రం దీక్ష చేస్తానని అంటున్నారు. మరి జగన్ దీక్షలో కూర్చుంటారా..? కూర్చుంటే ఏం జరుగుతుంది అని సర్వత్రా చర్చ నడుస్తోంది. రాజధాని శంకుస్థాపనకు సమయం దగ్గర పడుతున్న సమయంలో జగన్ చేపట్టిన దీక్ష టెన్షన్ రేపుతోంది. గుంటూరు కేంద్రంగా ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రాజధాని శంకుస్థాపనకు టీడీపీ ప్లాన్ వేస్తుంటే..అంతే దీటుగా స్టేటస్ ఫైట్ ను ప్రారంభిస్తోంది వైసీపీ. ప్రత్యేక హోదా -ఆంధ్రుల హక్కు నినాదంతో గుంటూరు నగర శివారులోని నల్లపాడు రోడ్డు వద్ద దీక్షకు దిగుతున్నారు వైఎస్ జగన్.

ఈ దీక్షను అటు జగన్ తో పాటు ఇటు పార్టీ నేతలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే భారీగా ఏర్పాట్లు చేశారు. పెద్దఎత్తున జనాన్ని తరలించడం ద్వారా ప్రజల ఆకాంక్షను చాటాలని ప్లాన్ చేశారు. ఈ దీక్ష ద్వారా ఏపీ ప్రభుత్వంతో పాటు.. కేంద్రంపైనా ఒత్తిడి పెంచాలని జగన్ భావిస్తున్నారు. ఇందుకు ప్రజామద్దతు కూడా తోడయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవానికి గత నెల 26నే నిరాహార దీక్ష చేయాలని జగన్ భావించారు. కానీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో వాయిదా వేశారు. ఈసారి కూడా  దీక్షను భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. కానీ ఇప్పటికే ప్రభుత్వం తరఫున అనుమతి లభించకపోవడం.. పోలీసులు దానికి పూర్తిగా అనుమతి నిరాకరించడంతో గుంటూరులో వాతావరణం వేడెక్కింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan  AP  Special Status  Police  Guntur  YSRCP  Jagan Protest  

Other Articles