Lawyer caught taking obscene photos of women with shoe-cam at Delhi Shopping Mall | Women Harassment Cases

Lawyer caught taking obscene photos of women with shoe cam at shopping mall

lawyer shoe camera incident, lawyer caught with shoe camera, lawyer taking women absence photos, delhi mall lawyer incident, spy camera videos, laywer spy camera, lawyer delhi mall, lawyer caught with spy camera

Lawyer caught taking obscene photos of women with shoe-cam at Shopping Mall : A 34-year-old corporate lawyer has been arrested for allegedly taking obscene pictures of women with a spy cam fitted to one of his shoes at a prominent South Delhi mall.

మహిళల అసభ్య చిత్రాలు తీస్తూ దొరికిన న్యాయవాది

Posted: 09/28/2015 01:00 PM IST
Lawyer caught taking obscene photos of women with shoe cam at shopping mall

పేరుకేమో న్యాయవాది.. నలుగురిలో మంచి గుర్తింపు కూడా వుంది.. పైగా హర్యానా కన్స్యూమర్ ఫోరమ్ మాజీ అధ్యక్షుడు కుమారుడు కూడా.. మొత్తంగా చెప్పాలంటే అతడు ఒక ఉన్నతస్థానంలో వున్న వ్యక్తి. కానీ.. బుద్ధి మాత్రం కీచకుడి కంటే మించింది. ‘తాను ఓ ఉన్నత స్థానంలో వున్నాను కదా! ఏం చేసినా ఎవరేం చేయలేరు’ అనుకున్నాడేమోగానీ సభ్యసమాజం తలదించుకేనేలా ఓ నీచమైన పని చేశాడు.. అడ్డంగా బుక్కయ్యాడు. ఇంతకీ ఇతను చేసిందేమిటి? అని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే..

న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి.. తన షూలో ఓ స్పై కెమెరా అమర్చుకున్నాడు. దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రముఖ మాల్ కు వెళ్లాడు. మహిళల పక్కన.. ముఖ్యంగా చీరలు ధరించిన వారి పక్కనే వుంటూ.. స్పై కెమెరా దాచుకున్న తన పాదాన్ని దగ్గరగా పెట్టడం మొదలు పెట్టాడు. ఫలితంగా మహిళల అసభ్య చిత్రాలు అతని కెమెరాలో చిత్రీకరించబడేవి. ఇలా కొద్దిసేపు అతని తతంగం ఆ స్టోర్ లో కొనసాగింది. అయితే.. ఇతగాడి ప్రవర్తవను గమనించిన ఓ స్టోర్ మేనేజర్ కు అనుమానం వచ్చింది. మహిళల పక్కన ఆ న్యాయవాది తన కుడి అడుగు వేస్తున్నప్పుడల్లా, మహిళల కాళ్ల సమీపానికి తన పాదాన్ని తీసుకెళుతుండటంతో ఆ మేనేజర్ నిలదీసి ప్రశ్నించాడు. దాంతో అతని వ్యవహారం బయటపడింది. సెక్యూరిటీ గార్డులు వచ్చి అతని బూట్ లో దాచివున్న కెమెరాను కనిపెట్టారు. దీంతో పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వగా.. వాళ్లు అరెస్ట్ చేశారు.

ఆ కీచక న్యాయవాదిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టి.. విచారణ జరుపుతున్నట్లు దక్షిణ ఢిల్లీ డీసీపీ ప్రేమ్ నాథ్ వెల్లడించారు. అతని వద్ద 12 అభ్యంతరకర క్లిప్స్ వున్నాయని.. వాటిని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశాడా? లేదా? అన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని వివరించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lawyer spy camera  delhi mall incident  spy camera women photos  

Other Articles