TRS MP Kavitha Donate 1 Year Salary To Telangana Farmers Who Committed Suicide | Telangana Farmers Problems

Trs mp kavitha donate 1 year salary to telangana farmers

mp kavitha news, mp kavitha updates, mp kavitha salary, kavitha parliament salary, telangana farmers, telangana problems, telangana issues, farmers suicide

TRS MP Kavitha Donate 1 Year Salary To Telangana Farmers : TRS MP Kavitha Annouced 1 Year Salary Donation To Telangana Farmers Who Committed Suicide.

రైతు కుటుంబాలకు వరాలు కురిపించిన కవిత

Posted: 09/28/2015 01:13 PM IST
Trs mp kavitha donate 1 year salary to telangana farmers

తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అప్పుల బాధలు తాళలేక, పంటలు చేతికి అందక ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల టీఆర్ఎస్ ఎంపీ కవిత ముందుకొచ్చి.. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆ సమయంలో కొందరు క్రీడాకారులు సైతం ముందుకొచ్చి తమవంతు విరాళాలు అందించారు. రైతులను ఆదుకోవడంలో తామెప్పుడూ సిద్ధంగా వుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఎంపీ కవిత రైతులకు సహాయార్థంగా భారీ విరాళం ప్రకటించారు. తన ఏడాది జీతాన్ని రైతు కుటుంబాలను ఆదుకోవడం కోసం విరాళంగా ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

పార్లమెంటు సభ్యురాలిగా కవితకు ఏడాదికి రూ.6 లక్షల జీతం వస్తుంది. ఈ మొత్తాన్ని ఆమె ఆత్మబలిదానాలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు సాయంగా అందించనున్నారు. అలాగే.. వారిని ఆదుకోవడంలో మరింత సహాయం చేసేందుకు ఆమె సన్నద్ధంగా వున్నట్లు తెలిపారు. ఈ విధంగా ఆమె ప్రారంభించిన రైతు దత్తత కార్యక్రమానికి మరికొందరు కూడా మద్దతు పలుకుతున్నారు. చెన్నైకి చెందిన ఓ కంపెనీ డైరెక్టర్ లావణ్య రూ.లక్ష విరాళాన్ని ఇచ్చారు. ఇంకా చాలామంది విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్నారని తెలిసింది. ఇలా ప్రతిఒక్కరు ముందుకు వస్తే.. రైతు ఆత్మహత్యలను చాలావరకు అరికట్టవచ్చు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mp kavitha latest news  telangana farmers  

Other Articles