Janagam Court Orders 14 Days Remand To Errabelli Dayakar Rao In A Case | TDP Party Updates

Janagam court orders 14 days remand for errabelli dayakar rao

errabelli dayakar rao, janagam court, andhra pradesh, telangana controversies, errabelli controversy, tdp trs fight, palakurthi incident, janagam police station

Janagam Court Orders 14 Days Remand For Errabelli Dayakar Rao : Janagam Court Orders 14 Days Remand To Errabelli Dayakar Rao In A Case.

కోర్టులో ఎర్రబెల్లికి షాక్.. 14 రోజుల రిమాండ్

Posted: 09/28/2015 12:59 PM IST
Janagam court orders 14 days remand for errabelli dayakar rao

టీటీఎల్పి నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు జనగామ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదివారం పాలకుర్తి మార్కెట్ యార్డులో చోటు చేసుకున్న వివాదంలో ఎర్రబెల్లి సహా 27 మందిపై కేసులు నమోదు అయ్యాయి. అసలు విషయం ఏమిటంటే.. పాలకుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో గోదాముల శంకుస్దాపన కార్యక్రమం సందర్భంగా టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తల మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఎస్‌ఐ ఉస్మాన్ షరీఫ్‌తో పాటు టీఆర్‌ఎస్ కార్యకర్తలు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటనలో భాగంగా ఎర్రబెల్లిపై పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయనతోపాటు మరో 27 మందిపై కూడా కేసులు నమోదయ్యాయి.

పోలీసులు సోమవారం ఉదయం జనగామ కోర్టులో ఎర్రబెల్లితోపాటు ఆ 27 మందిని హాజరు పరచగా.. వాదనలు విన్న అనంతరం కోర్టు వారందరికి 14 రోజుల విధించింది. జనగాం ప్రభుత్వ ఆస్పత్రిలో ఎర్రబెల్లికి వైద్య పరీక్షలు నిర్వమించిన అనంతరం జైలుకు తరలించనున్నారు. అయితే.. అప్పటికప్పుడు ఎర్రబెల్లి తరఫున ఆయన న్యాయవాదులు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ బెయిల్ లభించని పక్షంలో ఎర్రబెల్లి జైలుకెళ్లక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీడీపీ పార్టీకి ఎర్రబెల్లి వ్యవహారం మరింత ఇరకాటంలోకి నెట్టేసింది. ఈ వ్యవహారంపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : errabelli dayakar rao  janagam court  

Other Articles