Muslim man | performs | last rites | Hindu friend | hindu tradition

Muslim man performs last rites of hindu friend

Muslim man performs last rites of Hindu friend, Madhya Pradesh muslim man hindu friend, MP Baitul district muslim man, Hindu friend Santosh Singh Thakur, Abdul Razzak, Razzak cremated Santosh's body, Chhayabai, auto-rickshaw driver, I performed my duties as a friend,

Rising above religious boundaries, a Mulsim man has performed last rites of his Hindu friend Santosh Singh Thakur in Madhya Pradesh's Baitul district.

మతం గొడలు బద్దలుకోట్టి.. మిత్రుని దహనసంస్కారాలు

Posted: 09/22/2015 08:57 PM IST
Muslim man performs last rites of hindu friend

మానవత్వానికి, స్నేహానికి కుల, మత, ప్రాంతాలు అడ్డుకాదని, అడ్డురావని చాటిచెప్పాడు ఓ మహ్మదీయ యువకుడు. స్నేహానికి కన్న మిన్న ఈ లోకాన ఏమీ లేదంటూ.. గొప్ప మానవతావాదిలా నిలిచాడు. ప్రపంచంలో ఓ వైపు మతాలు మారణహోమాలను సృష్టిస్తున్నా.. తాను మాత్రం మానవత్వానికి, మైత్రికి కట్టుబడే వున్నానని నిరూపించాడు. అనారోగ్యంతో మరణించిన తన స్నేహితుడికి హిందూ మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వర్తించాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు సమీపంలోని బైతుల్ జిల్లాలో సంతోష్ సింగ్ థాకూర్ అనే కార్మికుడు అనారోగ్యంతో మృతిచెందాడు. అతనికి ఇద్దరు చిన్నపిల్లలు, భార్యతప్ప బంధువులెవరూ లేరు. దీంతో సంతోష్ సింగ్ అంత్యక్రియలు నిర్వర్తించడానికి దగ్గరవారంటూ ఎవరూ లేకపోయారు. సంతోష్ మృతితో అతని కుటుంబ దిక్కులేనిదైపోయింది. సంతోష్‌కి అబ్దుల్ రజాక్ అనే ఒక వ్యక్తి స్నేహితుడు. సంతోష్ కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయిన అబ్దుల్ రజాక్ హిందూ సంప్రదాయ ప్రకారం స్నేహితుడు సంతోష్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించాడు. తమ స్నేహం కులం ప్రాతిపదికన ఏర్పడలేదని, ఓ స్నేహితుడు ఏం చేయాలో తాను కూడా అదే చేశానని సంతోష్ సింగ్ చెప్పాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Santosh Singh Thakur  Abdul Razzak  Madhya Pradesh  Baitul district.  

Other Articles