AAP leader Somnath Bharti missing as police raid home and office

Somnath bharti faces arrest as hc denies anticipatory bail

Delhi HC denies anticipatory bail to somnath bharti, Somnath Bharti missing as police raid home and office, Somnath Bharti, aap, aam aadmi party, somnath bharti wife, somnath bharti bail, somnath bharti arrest, aam aadmi party, arvind kejriwal, jitender tomar

Delhi High Court rejecting anticipatory bail plea, former law minister Somnath Bharti, is all over the news. Again. By now, even his own Aam Aadmi Party will be sick of the unwanted attention.

అజ్ఞాతంలోకి ఆప్ నేత సోమ్‌నాథ్‌ భారతి.. వెతుకుతున్న పోలీసులు

Posted: 09/22/2015 09:33 PM IST
Somnath bharti faces arrest as hc denies anticipatory bail

గృహ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు సోమ్‌నాథ్‌ భారతికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దాంతో సోమ్‌నాథ్‌ భారతిని ఢిల్లీ పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. అయితే ఆయన మాత్రం కనిపించడంలేదు. సోమ్‌నాథ్‌ భారతిపై ఆయన భార్య లిఖిత మిత్ర గృహ హింస కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాను గర్భంతో ఉన్నప్పుడు కుక్కలతో కరిపించి... చంపేందుకు ప్రయత్నించారని లిఖిత ఆరోపించారు.

మంగళవారం ఢిల్లీ జాయింట్‌ కమిషనర్‌ దీపేంద్ర పాఠక్‌ మీడియాతో మాట్లాడుతూ సోమ్‌నాథ్‌పై ఎఫ్‌ఐర్‌ నమోదు అయినప్పటి నుంచీ ఆయనను విచారించడానికి ప్రయత్నిస్తున్నామని.. ఆయన తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు. ఆయన మీదున్న ఆరోపణలు, వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. సోమనాథ్‌ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించడానికి అనుమతించాలని ద్వారకా కోర్టు, హైకోర్టు రెండు న్యాయస్థానాల్లోనూ వాదించామని దీపేంద్ర తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Somnath Bharti  Delhi police  Delhi high court  anticipatory bail  

Other Articles