the modifail website to protest the PMs visit to Silicon Valley

A website to protest the modis visit

Modi, America, Modi fail, social Media, Prootest, Narendra Modi

On Sunday, less than a week before Indian Prime Minister Narendra Modi was due to visit Silicon Valley to promote his Digital India initiative, a stream of messages started to flood Twitter with the hashtag #Modifaildotcom

మోదీకి బ్యాండ్ బాజా భారాత్..?

Posted: 09/22/2015 03:23 PM IST
A website to protest the modis visit

నరేంద్ర మోదీ... భారత ప్రధానిగా, సోషల్ మీడియాలో హీరోగా బాగా పేరు వచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మోదీకి యమా క్రేజ్ ఉంది. అందుకే మోదీకి ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాల్లో విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో కూడా మోదీ గెలుపులో సోషల్ మీడియా ఎంతో బాగా పని చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా వల్లే మోదీకి అంత మెజారిటీ రాగలిగింది అంటే ఎంత సత్తా ఉందో ఊహించండి. అయితే ఇదంతా గతం.. మోదీ మానియా రోజు రోజుకు తగ్గుతోంది. తాజాగా అమెరికా పర్యటనకు సిద్దమైన మోదీకి ఛేదు అనుభవమే ఎదురవుతోంది. అక్కడ ఉంటున్న ఎన్ఆర్ఐలు మోదీకి ఝలక్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే అది కూడా మోదీ ఏ సోషల్ మీడియా ద్వారా అయితే ఫేమస్ అయ్యారో అదే సోషల్ మీడియా ద్వారా వ్యతిరేక ప్రచారం సాగనుంది.

తాజాగా మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఒక ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభించారు కొందరు వ్యక్తులు. మోదీఫెయిల్(modifail.com) అనే పేరుతో ఓ సైట్ ను ఏర్పాటు చేసి అందులో మోదీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్‌లో దళితులు, మైనారిటీలు, మహిళలకు వ్యతిరేకంగా హింస పెరిగిపోయిందని వారు ట్విట్టర్‌లో విమర్శిస్తున్నారు. పౌర హక్కులు మంటగలుస్తున్నాయని, అకాడమిక్, సాంస్కృతిక సంస్థల్లో మత ఛాందస రాజకీయాలను చొప్పిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. అమెరికాలోని ప్రవాస భారతీయుల ప్రయోజనాల కోసం ఇంతవరకు మోదీ ప్రభుత్వం ఒక్క చర్య కూడా తీసుకోలేదని విమర్శిస్తున్నారు.

భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను, ప్రవాస భారతీయులను ఆహ్వానించేందుకు సిలికాన్ వ్యాలీకి వస్తున్న మోదీని ఆయన ఏడాది పాలన తీరుపై, విజన్‌పై నిలదీయాల్సిన అవసరం ఉందని ‘న్యాయం, జవాబుదారితనం కోసం కూటమి’గా చెప్పుకుంటున్న సభ్యులు పిలుపునిస్తున్నారు. 27వ తేదీన సిలికాన్ వ్యాలీ వద్ద నిరసన ప్రదర్శన జరుపుతామని వారు ప్రకటించారు. వారి వెనక ఏదైనా రాజకీయ పార్టీ హస్తం  ఉందా ? అన్న విషయం మాత్రం స్పష్టం కావడం లేదు. సాన్ జోస్‌లోని సాప్ సెంటర్‌లో సెప్టెంబర్ 27వ తేదీన 18,500 మందిని ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  America  Modi fail  social Media  Prootest  Narendra Modi  

Other Articles

 • Jayalalithaa death mystery inquiry continues

  అమ్మ డెత్ మిస్టరీ.. ఇక వీడదా!

  Jun 26 | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతం మొదలైన రాజకీయ స్తబ్థత ఇంకా కొనసాగుతూనే వస్తోంది. అన్నాడీఎంకే పార్టీ గ్రూప్ తగదాలు తారా స్థాయికి చేరగా, వాటిని వాడుకుని లాభపడేందుకు ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా... Read more

 • Traffic cop denies pakistani legislator apoloy

  సారీ... మీ ముష్టి డబ్బు మాకు అక్కర్లేదు!

  Jun 26 | ఇంతకీ నేనెవరో తెలుసా?.. ఈ ఒక్క డైలాగ్ తమను అడ్డగించిన ట్రాఫిక్ కానిస్టేబుళ్లతో వీవీఐపీలు, వాళ్ల కొడుకులు దురుసుగా ప్రవర్తించిన తీరు చాలా సార్లు చూసి ఉంటాం. అయితే ఇది ఒక్క ఇండియాకే పరిమితం... Read more

 • Shilpa mohan reddy counters akhila priya over nandyala bypoll

  నంద్యాల బైపోల్: ఒకరి ఎగ్జిట్ మాత్రం ఖాయం!

  Jun 26 | నంద్యాల ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారబోతుంది. అఖిల ప్రియ వర్సెస్ శిల్పా మోహన్ రెడ్డి గా మారిన పోటీలో ఎవరిది గెలుపు అన్న దానిపై రాజకీయ విశ్లేషకుల అంచనాలు ప్రారంభమైపోయాయి. ఈ నేథప్యంలో తాను... Read more

 • Kesineni nani response on controversies

  నాని.. ఆల్ ఈజ్ వెల్ నిజమేనా?

  Jun 26 | రవాణా శాఖ అధికారిపై దాడి, ఆపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో క్లాస్ పీకించుకోవటం, తన ట్రావెల్స్ కు జరిగిన డ్యామేజ్, బీజేపీ పొత్తుపై కామెంట్లు... ఇలా ఆ మధ్య వరుస వార్తలతో టీడీపీ ఎంపీ కేశినేని... Read more

 • Anti naxal operation completed in chhattisgarh

  తూటాల వర్షం.. 40 మంది మృతి

  Jun 26 | ఛత్తీస్ గఢ్ లో భద్రతా దళాలు తమ ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. మూడు రోజుల్లో నాలుగు ఎన్ కౌంటర్ లు చేసి సుమారు 40మంది మావోలను మట్టుపెట్టాయి. తొండమార్కా ఎన్ కౌంటర్ లో 20 మంది... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno