Who Made Him Professor of Secularism

Who made him professor of secularism

Nitish Kumar, Mulayam, Bihar, Elections, Secular, Professor, Secularism, Bihar Chief Minister

Partners till three weeks ago, politicians Mulayam Singh Yadav and Nitish Kumar are now unburdening themselves of angry accusations against each other. Mr Kumar, running for a third term as Bihar Chief Minister, today asked if Mr Yadav "is a Vice Chancellor of the University of Secularism....and are we just research scholars?"

ఆయన ప్రొఫెసర్ ఎప్పుడయ్యారన్న సిఎం

Posted: 09/22/2015 04:02 PM IST
Who made him professor of secularism

ఆయన గారు ప్రొఫెసర్ అయ్యారట.? అయినా ఎవరు ఆయనను ప్రొఫెసర్ ను చేశారు.? ఆయన గారు ఆ యూనివర్సిటీకి డీన్ అయితే మేము కాలేజీలోని స్కాలర్సా..? అంటూ ఓ ముఖ్యమంత్రి గారు మరో కీలకనేత మీద చిందులు తొక్కారు. అయితే నిన్నటి దాకా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్.. తేరా సాత్.. మేరా సాత్ అంటూ చెట్టాపట్టాలేసుకున్న వారు ఉన్నట్టుండి కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతున్న నాటకం అనుకుంటున్నారా..? ఇంకెక్కడ మరి కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న బీహార్ లో. రాజకీయాలకు, కొత్త పొత్తులకు, కొత్త ఎత్తులకు బీహార్ పెట్టింది పేరు.. అలాంటి బీహార్ లో ప్రస్తుతం అంతా హాట్ హాట్ గా సాగుతోంది.

లౌకికవాద యూనివర్సిటికి ములాయం సింగ్ డీనా..? ఆయన ప్రొఫెసర్ ఎప్పుడయ్యారు..? మరి ఆయన కాలేజీ డీన్ అయితే మరి మేమేంటి..? కాలేజీలో రీసెర్చ్ చేసే స్కాలర్సా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. మొత్తానికి మొన్నటి దాకా పొత్తు పొత్తు అని అనుకుంటూ తిరిగి.. ఇప్పుడు మాత్కరం ఒకరి మీద ఒకరు ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. నిన్నటి దాకా అంతా సక్రమంగా అనిపించి.. నేడు మాత్రం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం అక్కడ ఓటర్లను ఆశ్చర్యపోతున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish Kumar  Mulayam  Bihar  Elections  Secular  Professor  Secularism  Bihar Chief Minister  

Other Articles