Will cut off tongues of writers for insulting Hindu gods

Will cut off tongues if insult hindu gods

hindu, Gods, Sriram sena, Kannada, Pramod Muthalik, Pramod Muthalik contraversial statements

A day after right-wing outfit Sri Rama Sene founder Pramod Muthalik said that he will sue Kannada writers for naming his organization as a conspirator behind the killing of renowned writer and rationalist Dr MM Kalburgi, its state convener has now threatened to cut off the tongues of writers if they continue to "insult" Hindu gods.

తప్పుగా మాట్లాడితే నాలుక కోస్తారట

Posted: 09/22/2015 01:19 PM IST
Will cut off tongues if insult hindu gods

అవును.. దేవుళ్ల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా.. తప్పుగా రాసినా కానీ వాళ్ల నాలుకలు కోస్తమని శ్రీరాం సేన వెల్లడించింది. శ్రీరాం సేన  వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిఖ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కర్ణాటకలో ఓ రచయిత హిందు దేవుళ్ల గురించి తప్పుగా మాట్లాడాడని.. తప్పుగా రాశారని అందుకే అతని మీద ఓ ముఠా దాడికి దిగిందని వార్త వినిపిస్తోంది. అయితే ఇదే సమయంలో ముతాలిక్ చేసిన వ్యాఖ్యలు మరింత కలకలాన్ని రేపుతున్నాయి. గతంలో కూడా శ్రీరాం సేన కార్యకర్తలు హిందు పరిరక్షణ పేరిట చేసిన కార్యక్రమాలు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారాయి. గోవా రాష్ట్రంలో ప్రమోద్ ముతాలిఖ్ మీద నిషేదం కూడా విధించారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా ముతాలిఖ్ మీద విమర్శలకు తావిస్తోంది.

హిందు సంప్రదాయంలో శ్రీరాముడిని, శివుడిని దేవుడుగా కొలుస్తారు. ఎంతో కాలంగా ఎంతో మంది హిందు దేవుళ్లను ఆరాధిస్తున్నారు. అయితే ఈ మధ్యన దేవుడు లేరని వాదించే వితండవాదులు అసలు శ్రీరాముడి మీద, శివుడి మీద విమర్శలు చేయడం శ్రీరాం సేనకు కోపం తెప్పించింది. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తే శ్రీరాం సేన కార్యకర్తలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే తాజగా మరోసారి ప్రమోద్ ముతాలిక్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి కర్ణాటక భగ్గుమంది. మరి దీని మీద అక్కడి వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hindu  Gods  Sriram sena  Kannada  Pramod Muthalik  Pramod Muthalik contraversial statements  

Other Articles