pawan kalyan | nana patekar | farmers

There is nana patekar in bollywood pwankalyan in tollywood

pawan kalyan, nana patekar, pawan Kalyan for farmers, Janasena, pawan kalayan news

There is Nana Patekar in Bollywood pwankalyan in tollywood. In bollywood nanapatekar helps the famers families who suicide.

అక్కడ నానా పటేకర్.. ఇక్కడ పవన్ కళ్యాణ్

Posted: 09/07/2015 04:41 PM IST
There is nana patekar in bollywood pwankalyan in tollywood

రైతుల నుండి భూములు బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదు... అది మిత్రపక్షమైనా సరే ఇది పవన్ కళ్యాణ్ రైతుల నుండి బలవంతంగా భూములను లాక్కునే ప్రయత్నం చేసిన వ్యాఖ్యలు. రైతుల కష్టాలు తెలిసిన వాడిగా, ఓ రైతు బిడ్డగా స్వయంగా రైతుగా పవన్ కళ్యాణ్ తన అనుభవాలను వారితో పంచుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ ఎంత రాజీ ప్రయత్నాలు చేసిన పవన్ మాత్రం అందులో వెనక్కి తగ్గలేదు. తాజాగా హిందీ స్టార్ నానా పాటేకర్ మహారాష్ట్రలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకున్నారు నానా పటేకర్. అయితే అటు బాలీవుడ్ లో నానా పటేకర్ మాదిరిగానే టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కూడా రైతు పక్షపాతి. అందుకే ప్రతిసారి రైతులకు అండగా నిలుస్తున్నారు. కాగా నానా మాత్రం స్వచ్ఛంద సంస్థల సహాయంతో సేవ చేస్తుంటే పవన్ మాత్రం పొలిటికల్ పార్టీ వేదికగా ప్రశ్నిస్తూ సేవ చేస్తున్నారు.

బాలీవుడ్ విలక్షణ నటుడిగా గుర్తింపు ఉన్న నానా పటేకర్ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ, అందుకు ఏ రాజకీయ కారణం లేదు. ఒక ఎన్జీవోతో కలిసి.. రైతు పక్షపాతిగా మారారు. గతంలో విదర్భలో రైతుల ఆత్మహత్యలపై స్పందించిన ఆయన.. ఇంటింటికీ వెళ్లి దాదాపు 62 కుటుంబాలకు 15వేల రూపాయల చొప్పున సాయం చేశారు. ఆ తర్వాత మరడ్వాటాలో 112మంది వితంతువులను కలిసి అండగా నిలిచారు. మరో 7వందల మంది రైతు కుటుంబాలకు సాయం చేసేందుకు రెడీ అవుతున్నారు.

నానాకు రాజకీయాల్లోకి రావాలని, రాజకీయ వేదిక సృష్టించుకోవాలని గానీ కోరిక లేదు. ఎప్పుడూ లోప్రొఫైల్లో ఉంటారు. రైతుల, మృతి చెందిన వారి కుటుంబాలకు చేతనైనంత సాయం చేస్తుంటారు. అదేదో ప్రజాప్రతినిధిగా చేయొచ్చుకదా ? అని అనేక మంది ఇప్పటికే ఆయన్ను అనేక సార్లు ప్రశ్నించారు. కానీ, ఆయన చెప్పే సమాధానం ఒక్కటే... "ఇప్పుడు బీజేపీ, గతంలో కాంగ్రెస్.. ఎవరూ రైతు పరిస్థితిని మార్చలేకపోతున్నారు. అధికారం ఉంటే నా పరిస్థితి ఏంటో తెలీదు. కానీ, ప్రస్తుతం చేస్తున్న సేవలో సంతృప్తి ఉందంటారు నానా". కానీ ప్రభుత్వాలకు మాత్రం ఒక మాట చెబుతున్నారు.. ఇవాళ ఆవేదనతో తనను తాను చంపుకుంటున్న రైతు.. రేపు ఆవేశంతో మరొకరిని చంపేరోజు రాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.టాలీవుడ్లో పవన్.. బాలీవుడ్లో పటేకర్. ఇద్దరిదీ ఒకే తత్వం. ఇద్దరు కోరుకునేదీ రైతుల శ్రేయస్సే. మంచి ఎవరు చేసినా కూడా ఆహ్వానించాలి.. అభినందించాలి కాబట్టి మన తెలుగు వారికి కూడా ఇలాంటి మనసున్న నాయకుడు దొరకడం నిజంగా అదృష్టం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  nana patekar  pawan Kalyan for farmers  Janasena  pawan kalayan news  

Other Articles