pakistan | India | Battle | India War

Pakistan army chief warned to india for battle

pakistan, India, Battle, India War

Pakistan Army chief warned to India for battle. If battle will Happen, India should pay the value.

భారత్ మీద మళ్లీ పాకిస్థాన్ ఛీప్ మాటలు

Posted: 09/07/2015 04:28 PM IST
Pakistan army chief warned to india for battle

భారత – పాక్ విభజనలో కాశ్మీర్ ..ఓ అపరిష్కృత అజెండా.. అని పాక్ ఆర్మీచీఫ్ రహీల్ షరీఫ్ పేర్కొన్నారు. ఉభయ దేశాలమధ్య చిన్న యుద్దమైనా.. లేదా పెద్ద యుద్దమైనా జరిగేది మాత్రం. విధ్వంసమే.. అని పాక్ ఆర్మీచీఫ్ హెచ్చరించారు. కాశ్మీర్ ను భారత్ లో అంతర్గత భాగంగా గుర్తించేందుకు ఇప్పటికీ పాక్ సిద్ధంగా లేదని మరో సారి రుజువు చేశారు. విదేశాల నుంచి దురాక్రమణ ఎదురైతే.. దేశాన్ని అన్నివిధాల రక్షించుకోగల పూర్తి సామర్థ్యం తమ సైనిక దళాలకు ఉందని రావల్పిండిలో జరిగిన ఓ కార్యక్రమంలో జనరల్ షరీఫ్ పేర్కొన్నారు. పరోక్షంగా భారత్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో ఎలాంటి యుద్ధాలు ఎదురైనా మెరుపుదాడులు జరిగినా, భారతదేశం సర్వసన్నద్ధంగా ఉందని భారత సైనికాధిపతి జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ గతవారం చేసిన వ్యాఖ్యకు జవాబుగా పాక్ ఆర్మీచీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో పాక్ తరచు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. జమ్మూ కాశ్మీర్ లో రోజూ ఏదో అలజడి సృష్టించేందుకు యత్నిస్తోంది. ఇటీవల సరిహద్దుల ఆవలనుంచి పాక్ రేంజర్లు జరిపిన కాల్పులకు ఆరుగురు పౌరులు బలయ్యారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో పర్యటించిన భారత ఆర్మీచీఫ్ .. బాధితులు, సైనికుల నుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా యుద్ధం వస్తే.. భారత్ సర్వ సన్నద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పాక్ సైనికులకు ధైర్యం చేప్పే కృషిలో పాక్ ఆర్మీచీఫ్ రావల్పిండిలో ప్రసంగించారు. శతృదేశం ఏమాత్రం దుందుడుకు చర్యలకు దిగినా .. అపరిమితమైన విధ్వంసం తప్పదని హెచ్చరించారు.

సరిహద్దుల్లో పాకిస్తాన్‌ దుశ్చర్యలు సహించరానివని ఈసారి యుద్ధం వస్తే పాకిస్తాన్‌ను నాలుగు ముక్కలు చేస్తామని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు. భారత్‌ యుద్ధాన్ని కోరుకోవటంలేదని, అందుకే సయంమనం పాటిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్‌ నిరాశ చెందుతోందని, తన బాధను వ్యక్తం చేస్తోందని అన్నారు. భారత్‌ను పాక్‌ ఎదుర్కోలేదని ఆయన అన్నారు. మనం యుద్ధం కోరుకోవడంలేదని, యుద్ధమే గనక వస్తే పాక్‌కు తగిన విధంగా బుద్ధి చెబుతామని ఆయన అన్నారు. గత యుద్ధంలో పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేశామని, ఈసారి నాలుగు ముక్కలు చేస్తామని సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు. మనకు ఆత్మవిశ్వాసం ఉందని, పాకిస్తాన్‌కు భయం ఉందని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan  India  Battle  India War  

Other Articles