Modi | Trips | Narendra Modi

Pms foreign trips cost rs 37 crore in first year

Modi, Trips, Narendra Modi Foreign Visits, Modi Tour, Expenses

PMs foreign trips cost Rs 37 crore in first year PM Narendra Modi's foreign trips cost the exchequer over Rs 37 crore with his Australia trip proving to be the most expensive one.Documents accessed under RTI Act reveal that Indian missions in 16 countries spent Rs 37.22 crore in one year. Modi visited 20 countries between June 2014 and June 2015. However, the missions in Japan, Sri Lanka, France and South Korea denied disclosure of information to RTI applicant Comm (retd) Lokesh Batra. Batra had approached individual missions seeking expense related information on the PM's trip.

మోదీ పర్యటనలకు 37కోట్ల పైచిలుకు ఖర్చు

Posted: 09/07/2015 03:52 PM IST
Pms foreign trips cost rs 37 crore in first year

మేకిన్ ఇండియా.. స్వచ్ఛ భారత్.. యోగా డే అంటూ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్న బారత ప్రధాని నరేంద్ర మోదీ తనలో ఉన్న మరోకోణాన్ని బయటకు తీస్తున్నారు. సూట్ బూట్ వాలా సర్కార్ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అక్షరాల నిజాలుగా అనిపించేలా మోదీ చేస్తున్న ఖర్చు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.  దుబారా ఖర్చులకు కాంగ్రెస్ వాళ్లు పెట్టింది పేరు కానీ మేము మాత్రం అలా కాదు.. ప్రతి రూపాయికి మేము ఖచ్చితంగా జవాబుదారిగా నిలుస్తాం అంటూ బీరాలు పలికిన మోదీ గారి విదేశీ పర్యటనలకు చేసిన ఖర్చు చూస్తే మాత్రం నోటిని వేలువేసుకోకుండా ఉండలేరు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారంలో మోదీ గారి ఖర్చు వివరాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తరచుగా విదేశీ పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు కూడా పలు విమర్శలు చేస్తున్నాయి. మరి మోడీ చేస్తున్న విదేశీ పర్యటనలకు ఖర్చు ఎంతవుతుంది ? ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ? అనే ఆలోచనలు అందరిలో కలుగక మానదు. ఓ వ్యక్తికి కూడా ఇలాగే సందేహాలు వచ్చాయి. దీనితో సమాచార హక్కు చట్టాన్ని వినియోగించాడు. 2014 జూన్ నుండి ఈ ఏడాది జూన్ మధ్య కాలంలో మోడీ చేసిన విదేశీ పర్యటనల మొత్తం ఖర్చులను తెలుపమన్నాడు. అక్షరాల 37 కోట్లు ఖర్చయిందని తేలింది. అగ్రభాగం ఆస్ట్రేలియా పర్యటనకు ఖర్చు పెట్టారని పేర్కొంది. ఏడాది కాలంలో మోడీ మొత్తం 20 దేశాల్లో పర్యటించారని, మొత్తం 37.22 కోట్లు ఖర్చయిందని పేర్కొంది. వీటిలో అత్యధికంగా ఆస్ట్రేలియా, యూఎస్, జర్మనీ, ఫిజీ, చైనా దేశాలకు కాగా భూటాన్ పర్యటనకు మాత్రం 41.33 లక్షలు తక్కువగా ఖర్చయ్యాయని వివరించారు. హోటల్ లో బస ఖర్చు 5.60 కోట్లు అని, అద్దె కార్లకు 2.40 కోట్లు అని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Trips  Narendra Modi Foreign Visits  Modi Tour  Expenses  

Other Articles