AP chief minister chandrababu a caught thief alleges chevireddy bhaskar reddy

Uproar over vote for note case in ap assembly

ap assembly session, vote for note, cash for vote, ysrcp adjournment motion, AP assembly session, CM chandrababu naidu, YS Jagan mohan Reddy, Phone tapping, Section 8 in Hyderabad, dhulipalla narendra, chevireddy bhasker reddy, horse riding, voice tapes, forensic lab reports

YSR congress party MLA cheviReddy Bhasker Reddy alleges that andhra pradesh chief minister chandrababu is a red handedly caught thief.

ఇక్కడ దోరలా ఫోజులు కొట్టేది.. అక్కడ అడ్డంగా దొరికిన దొంగే..

Posted: 09/04/2015 02:02 PM IST
Uproar over vote for note case in ap assembly

ఓటుకు కోట్లుపై ఏపీ అసెంబ్లీ శుక్రవారం దద్దరిల్లింది. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ చివరి రోజు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. వాయిదా తీర్మానంపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టడంతో అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే పది నిమిషాల పాటు వాయిదా పడింది. కాగా  ఇవాళ ఉదయం అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ఆరంభమయ్యాయి.  ఓటుకు కోట్లు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
    
అయితే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ...వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు ...స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. ఓటుకు కోట్లు కేసుపై చర్చ జరపాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. సభ జరిగేందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా ...ఫలితం లేకపోవటంతో సమావేశాల చివరిరోజున రెండు పర్యాయాలు పది నిమిషాలపాటు వాయిదా వేశారు.

ఈ సందర్భంగా మీడియాపాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. సొంత రాష్ట్రంలో దోరలా ఫోజులు కోడుతున్న చంద్రబాబు.. పక్క రాష్ట్రంలో అడ్డంగా దొరికిపోయిన దొంగ అని ఎద్దేవా చేశారు. ఆయన దొంగతనాలు, దొంగ బుద్ధి సొంత రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా చూపించాడని తెలిపారు. కానీ, అక్కడి చివరికి దొరికిపోయాడని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పరువును నిలువునా తీశారాని, భవిష్యత్తును తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబులాంటి అవినీతి పరుడు రాష్ట్రంలో ఎవరూ లేరని అన్నారు.

తన అవినీతి సొమ్ముతో ఇరు రాష్ట్రాల్లో ఓట్లు కొన్నారని ఆరోపించారు. రెండు ఎకరాల భూమి మాత్రమే ఉన్న చంద్రబాబునాయుడు రెండు వేల ఎకరాల స్థాయికి ఎలా ఎదిగారని ప్రశ్నించారు. ఓటుకు కోట్లుపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎప్పుడైనా అరెస్టు చేస్తారేమోనన్న భయంతోనే పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అవకాశం ఉన్నా విజయవాడ వెళ్లిపోదామంటున్నారని ఎద్దేవా చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vote for note  cash for vote  ysrcp adjournment motion  AP assembly session  

Other Articles