82 year old living on a few teaspoons of water a day

82 year old s fast to death has a name as court allows santhara

a ritual fast to embrace death, Rajasthan High Court, Supreme Court, santhara, rajasthan, bikaner, teaspoons water, 82 years old, badani devi. Bikaner old woman, Gangashaher, legal trouble, Jaipur,Supreme Court,Woman on Santhara

Hours after the Supreme Court stayed the Rajasthan High Court's decision which said Santhara - a ritual fast to embrace death --- was akin to suicide and therefore punishable, an 82-year-old woman in Bikaner declared that she has undertaken Santhara.

మరణాన్ని అహ్వానిస్తూ వృద్దురాలి ఉపవాస దీక్ష..

Posted: 09/02/2015 05:57 PM IST
82 year old s fast to death has a name as court allows santhara

(Image source from: http://www.teluguwishesh.com/administrator/index.php?option=com_k2&view=item#)

సనాతన ధర్మాలకు, ఆచారాలను, అనేకానేక సంప్రదాయాలకు పుట్టినిల్లి మన కర్మభూమి. హైందవ మతంలో అనేక ఆచారాలు వున్నాయని తెలుసు. అయితే వాటిలో కొన్ని దురాచారాలు, మూఢాచారాలని వాటికి వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్తలు వున్నారు. అయితే ప్రపంచానికి తెలియని మరో వింత ఆచారం జైన మతంలో వుంది. అదే సంతర. ఈ ఆచారం ప్రకారం వృద్దాప్య దశకు చేరిన వారు ఈ ఆచారాన్ని స్వీకరించి మరణాన్ని ఆహ్వానిస్తారు. మరణం సంభవించే వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకుండా కేవలం టీ స్పూన్ తో కొన్ని చెంచాల నీరు తీసుకుని బతికేస్తారు. ఇది తమ ఆచారమని, మరోలా చెప్పాలంటే తాము సంతర దీక్షకు పూనుకున్నామని సగర్వంగా చెప్పుకుంటారు అ మతవృద్దులు.

అయితే ప్రపంచానికంతగా తెలియని ఈ సంతర ఇప్పుడు మాత్రం దేశవ్యాప్త ప్రజానికానికి పరిచయం అయ్యింది. అదెలా అంటారా..? రాజస్థాన్ హైకోర్టు వెలువరించిన కొద్ది గంటల వ్యవధిలోనే దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ దీక్షను సమ్మతిస్తూ.. అనుమతిని మంజూరు చేయడంతో సంతర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు ఈ దీక్షకు పూనుకున్న 82 ఏళ్ల వృద్ద మహిళ బాదానీ దేవి వార్తల్లోని వ్యక్తిగా మారారు. జైపూర్కు సరిగ్గా 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న బికనీర్కు చెందిన బదానీ దేవీ(82) గత రెండు నెలలుగా కఠిక ఉపవాసం ఉంటుంది.

అయితే అది అలాంటి ఇలాంటి ఉపవాస దీక్ష కాదు. కేవలం ద్రవ పధార్థం అందులోనూ కేవలం మంచినీరు.. అదికూడా రోజుకు కేవలం ఓ రెండు మూడు చెంచాల నీళ్లతో సరిపెట్టుకొని ఆరోగ్య పరమైన సమస్యలు లేకుండా జీవిస్తోంది. చాలాకాలంగా భోజనం మానేసిన కారణంగా ప్రస్తుతం ఆమె సరిగా మాట్లాడలేక మంచానికే పరిమితమైంది. ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కోడళ్లు మనవళ్లు మనవరాళ్లు ఉన్నారు. అయితే తినడానికి తిండి లేక కాదు.. తనను తాను భగవంతుడిలో ఐక్యం చేసుకునే పనిలో భాగంగా బాదానీ దేవి ఈ కఠినమైన ఉపవాస దీక్షకు పూనుకున్నారు. తమ జైన మతాచారం ప్రకారం అమె ఈ దీక్ష్నకు పూనుకున్నారు. ఇలా చేయడం నేరమని ఇందుకు శిక్షపడక తప్పదని రాజస్థాన్ హైకోర్టు తీర్పును వెలవరించిన కొన్ని గంటల్లలో అమె దీక్ష మాతాచారం మేరకు సాగతున్న నేపథ్యంలో అమె దీక్షకు మద్దతు తెలిపిన సుప్రీకోర్టు కిందికోర్టు వెలువరించిన తీర్పుపై స్టే విధించడంతో.. తాను సంతర దీక్షను తీసుకున్నాని గర్వంగా చెప్పింది ఈ బామ్మ.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : santhara  rajasthan  bikaner  teaspoons water  82 years old  badani devi  

Other Articles