fight between school students one dead in hyderabad abids

Hyderabad student dies after scuffle with his classmate

Student Dies, Student Scuffle, 10th Grade Student Dies, Fight, Hyderabad Student, St.Joseph school, students fighting, student dead, hyderabad abids, unconscious boy, hospital, school management, treatment, DCP kamalhassan reddy, culpable homicide, death was accidental

A student of grade 10 from St.Joseph School in Hyderabad died of after a rigorous fight yesterday with a classmate during in the afternoon.

ITEMVIDEOS: ప్రాణం తీసిన ఫైటింగ్.. దారి తప్పుతున్న బావిపౌరులు

Posted: 09/02/2015 12:55 PM IST
Hyderabad student dies after scuffle with his classmate

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఇద్దరి విద్యార్థుల మధ్య చిన్న విషయమై రేగిన వివాదం ఒకరి ప్రాణాన్ని బలిగొనింది. చిన్న విషయంలో ఇద్దరు విద్యార్థుల మద్య రేగిన ఘర్షణ...చివరికి ఒకరి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళితే అబిడ్స్‌ కింగ్‌ కోఠిలోని సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్లో మంగళవారం సాయంత్రం ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరు విద్యార్థులు పొట్లాడుకుంటున్న సమాచారం అందుకున్న ఉపాధ్యాయుడు ఘటనాస్థలానికి వెళ్లి వారిన వారించాడు. అయితే అప్పటికే బలమైన పిడిగుద్దుల తిన్న అమేర్ సిద్దిఖి సృహ కోల్పోయాడు.

దీంతో పాఠశాల యాజమాన్యం హుటాహుటిన సదరు విద్యార్థిని అస్పత్రికి తరలించి చికిత్సనందించింది. అయితే అస్పత్రిలో చికిత్స పొందుతూ సిద్దిఖి ఇవాళ ఉదయం మరణించాడు. విద్యార్థుల మధ్య ఇంతటి తీవ్రమై ఘర్షణ జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అబిడ్స్ డిసిపీ కమల్ హాసన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టులు చేయలేదని తెలిపారు. పొట్లాటకు దిగిన ఇద్దరు విద్యార్థులు మైనర్ులని అయితే ప్రమాదవశాత్తు మరణం సంభవించింది కానీ, కావాలని చేసిన చర్య కాదన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : St.Joseph school  students fighting  student dead  

Other Articles