One Rupee Meals | Venkataraman | Erode |Tamilnadu

One rupee meal by v venkatramans noble step in making our world a better place

One Rupee Meals, Venkataraman, Erode,Tamilnadu, poor, Meals for Poor

one Rupee Meal By V Venkatramans Noble Step In Making Our World A Better Place V. Venkatraman, a homely mess owner from Tamilnadu offers meals to the poor at a token of just 1 rupee. Around 15 kms away from Erode, a small town in Tamilnadu, is Shri AVM Homely Mess run by Mr. V. Venkatraman since 1995. It might look like just another eatery at first glance, but that's not it.

రూపాయికే కడుపు నిండా భోజనం

Posted: 09/02/2015 05:06 PM IST
One rupee meal by v venkatramans noble step in making our world a better place

రూపాయికి ఏం వస్తుంది? మహా అయితే ఓ చిన్న చాక్లెట్ వస్తుంది. అదే రూపాయికి భోజనం వస్తుందంటే నమ్మగలరా? ఇది నిజం. తమిళనాడులోని ఓ మెస్ యజమాని రూపాయికి అన్నం పెడుతున్నాడు. పేదల కడుపు నింపుతున్నాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి దయామయులున్నారు అనడానికి వెంకట్రామనే ఉదాహరణ. తమిళనాడులోని ఈరోడ్ పట్టణం. ఏఎంవి హోమ్లీ మెస్ యజమాని. అక్కడి ప్రభుత్వా ఆస్పత్రిలోని రోగులతో పాటు వచ్చే సహాయకులకు రూపాయికే భోజనం పెడుతున్నాడు. ఇలా ఏదో ఒక రోజు చేసి ఊరుకోవడం కాదు. గత ఎనిమిదేళ్లుగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు.

ఎనిమిదేళ్ల క్రితం, ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త కోసం ఓ వృద్ధురాలు వెంకట్రామన్ మెస్ కు వచ్చింది. 10 రూపాయలకు మూడు దోసెలు ఇచ్చాడు. ఇది తనకు భారమని, అయినా తప్పడం లేదని ఆమె చెప్పింది. దీంతో వెంకట్రామన్ చలించిపోయాడు. ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగుల గురించి ఆరా తీశాడు. అందరూ పేదలే అని తెలుసుకున్నాడు. వారి సహాయకులకు రూపాయికే భోజనం పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నానని వెంకట్రామన్ చెప్పారు. మొదట్లో రోజుకు 10 మందికి టోకెన్ల ద్వారా రూపాయికే భోజనం పెట్టేవారు.

వెంకట్రామన్, ఆయన భార్య మనస్ఫూర్తిగా ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తున్నారు. టోకెన్ల సంఖ్యను కూడా పెంచారు. రోజూ ఉదయం 10 మంది రోగుల సహాయకులకు టిఫిన్ టోకెన్లు ఇస్తారు. రూపాయికే మూడు దోసెల పార్సిల్ ఇస్తారు. మధ్యాహ్నం 40 మందికి రూపాయికే భోజనం ప్యాకెట్లు ఇస్తారు. సాయంత్రం 20 మందికి రూపాయికే దోసె, చపాతి పార్సిల్ ఇస్తారు. మామూలు కస్టమర్లకు మాత్రం 50కే భోజనం పెడతారు. త్వరలోనే టోకెన్ల సంఖ్యను 100కు పెంచాలని భావిస్తున్నారు. రూపాయికి భోజనం పెట్టడం వల్ల నష్టం వస్తున్నా, మానవతా దృష్టితో కొనసాగిస్తామని వెంకట్రామన్ దంపతులు చెప్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : One Rupee Meals  Venkataraman  Erode  Tamilnadu  poor  Meals for Poor  

Other Articles