PawanKalyan | Birthday | Powerstar | Pawanisam

From kalyan to pawanisam what is the special in that words

Pawan Kalyan, Pawan Kalyan fans, Janasena, Pawan Kalyan news, Pawan Kalyan Updfates, Pawan Kalyan satements, Pawan Kalyan comments, Pawan Kalyan tweets, Pawan Kalyan cinemas, Pawan Kalyan trend, Pawan Kalyan latest news, Pawan Kalyan look, Pawan Kalyan on Politics

From Kalyan to Pawanisam what is the special in that words.A star was born in Telugu cinema in 1996. After making his debut in Akkada Ammayi Ikkada Abbayi, in the last 19 years, Pawan Kalyan has come a very long way in Telugu film industry.

పవన్ కళ్యాణ్ నుండి పవనిజం వరకు

Posted: 09/02/2015 03:44 PM IST
From kalyan to pawanisam what is the special in that words

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది తారలు వస్తుంటారు... వెళ్తుంటారు కానీ ఒక స్టార్ మాత్రం స్టార్ డమ్ అనే పదానికి అర్థాన్ని ఇచ్చారు. సినిమా స్టార్ అంటే సినిమానే ప్రపంచం, వారు మామూలు వ్యక్తులకు దూరంగా వారిదైన ప్రపంచంలో జీవిస్తారు అనే మాట వినబడేది. కానీ ఒక స్టార్ మాత్రం దాన్ని మారుస్తూ తనదైన ముద్రవేస్తూ ముందుకు సాగుతున్నారు. అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో తన సత్తాను చూపుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు వారి  గుండె తలపులో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ మీ కోసం.. అందులోనే పవన్ అభిమానుల కోసం..

Also Read:  పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో వాళ్లకు తెలిసిందా..?

పవన్ కళ్యాణ్ పేరులో ఏముంది...?
పేరులో ఏముంది.. నేను అనే గర్వం తప్ప.. కానీ అది ఎంత మాత్రం లేని పేర్లు మాత్రం  కొన్ని ఉంటాయి. అలాంటి పేర్లలో పవన్ కళ్యాణ్ అన్న పేరు కూడా ఉంటుంది. ఆ పేరు చెబితే తెలుగు హృదయాలు పరవశంతో తాండవిస్తాయి.. ఎన్నో అభిమాన గుండెలు ఆనందంతో తన్మయత్వం చెందుతాయి. ఎవరెస్ట్ ఎత్తును చేరుకునే స్థాయి ఉన్నా నేల మీద నడిచే మారాజు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఆ పేరులో వేల ఓల్ట శక్తి ఉంది. కంటికి కనిపించని పవర్ ఉంది. అందుకే అభిమానులు ఎంతో ప్రేమతో పవన్ కళ్యాణ్ అని పిలుచుకుంటారు.

Also Read:  పవన్ మీరే మా దేవుడు.. మీరు చెబితే భమూలిస్తాం.. పవన్ తో రైతులు

పవనిజం అంటే ఏమిటి..?
ఎంతో మంది హీరోలు ఉన్నారు.. ఇక మీదట ఎంతో మంది పుడతారు కానీ ఎవరికీ సొంతం కాని ఓ ప్రత్యేకత మాత్రం పవన్ కు సొంతం. అదే పవనిజం. అసలు పవనిజం అంటే ఏమిటి..? ఎన్నో సార్లు, ఎంతో మంది అడిగే ప్రశ్న. సోషలిజం, లెనినజం అని విన్నాం కానీ ఈ పవనిజం అంటే ఏమిటి..? అని ప్రశ్న. కానీ ఈ ప్రశ్నకు సమాధానాన్ని పుస్తకాల్లో వెతికితే దొరకదు. మనసు తలపులు తెరిచి చూస్తే కనిపిస్తుంది... కంటికి కనిపించని, కన్నీటి వెనుక ఉన్న ఆవేశాన్ని కళ్లారా చూస్తే కనిపిస్తుంది పవనిజం అంటే ఏమిటో. దేశభక్తి అన్నింటికి మించింది.. అన్నింటికి అతీతమైంది. ఇది పవనిజంలో ఓ పాయింట్ మాత్రమే.అన్నార్థుల ఆకలి కేకలను వినగలిగే శక్తినిస్తుంది పవనిజం. ఇలా చెప్పుకుంటూపోతే ఎంతో ఉంటుంది. కానీ దీని మాట్లాడమని పవన్ కళ్యాణ్ ను అడిగితే మాత్రం.. సమాజం కోపం దేశం కోసం బ్రతకడమే పవనిం అయితే అదే పవనిజం అంటారు. మళ్లీ అడిగిడే ఆయన చెప్పే మాట జైహింద్.

పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ కన్నా ఎక్కువ ఎందుకు..?
పవన్ కళ్యాణ్ కు ముందు ఎంతో మంది సినిమా ఇండస్ట్రీని ఏలారు. ఎంతో మంది సినిమా కీర్తి ప్రతిష్టలను నలువైపులా వ్యాపింపజేశారు. కానీ అలా ఎంత మంది ఉన్నా. భవిష్యత్తులో ఎంత మంది వచ్చినా చెరిగిపోని ముద్రలు మాత్రం కొంత మంది మాత్రమే వేస్తారు. ఆ కొంత మంది జాబితాను రాయాల్సి వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ అన్న పేరు ఖచ్చితంగా ఉండాల్సిందే. పావలా శ్యామల అనే ఓ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆరోగ్యం బాగోలేకపోతే.. పవన్ కళ్యాణ్ 75 వేల రూపాయల ఆర్థిక సమాయం చేశారు. ఉత్తాఖండ్ లో చోటుచేసుకున్న వరదలల్లో వేల మంది అనాదలుగా మారితే... వారి సహాయార్థం 20లక్షల రూపాయలు అందించిన మానవతావాది పవన్ కళ్యాణ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అందుకే తెలుగు ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ అంటే కేవలం సినిమా స్టార్ గానే కాకుండా మానవతావాదిగా ఎంతో పేరుంది.

Pawankalyan01
Pawankalyan010
Pawankalyan022
Pawankalyan03
Pawankalyan04
Pawankalyan05
Pawankalyan06
Pawankalyan07
Pawankalyan08
Pawankalyan09

Also Read: పవన్ కళ్యాణ్ రావాలి.. ప్రత్యేక హోదా తేవాలి

నాయకుడిగా పవన్ కళ్యాణ్..
జనానికి ముందుండి నడిపించే సరైన నాయకుడు కావాలి. ఆ నాయకుడు అన్న పదానికి పూర్తి నిర్వచనం ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ పేరుతో తెలుగు నేల మీద మరో ప్రభంజనానికి తెర తీశారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నికల్లో జనాలకు వాస్తవాలను వివరిస్తు ఎవరికి ఓటు వెయ్యాలి.? ఎందుకు వెయ్యాలి అన్నదాని మీద పూర్తి క్లారిటీ ఇచ్చారు. అయితే కొన్నాళ్లు పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారు. మేధావి మౌనం సమాజానికి మంచిది కాదు అని ఓ సామెత. ఎందుకు అంటే మేధావి మౌనం సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. అయితే .జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విఫయంలోనూ ఇలానే జరుగుతోంది అంటున్నారు కొంత మంది పవన్ కళ్యాణ్ అభిమానులు. జనసేన పార్టీ అధినేత, సినీ హీరో  పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత చాలా కాలం వరకు రాజకీయాల మీద పెద్దగా స్పందించలేదు. మార్పును కోరుకునే, ఎంతో విజన్ ఉన్న నాయకుల్లో వపన్ కళ్యాణ్ ఒకరు. రైతుల కన్నీళ్లు తుడిచే జననేతగా పవన్ కళ్యాణ్ ఒకరు అని తెలుగు ప్రజలు భావిస్తున్నారు.

చేసింది.. వందల సినిమాలు కాదు పట్టుమని రెండు పదుల సినిమాలు కానీ సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఎన్నికల్లో ఇంకా పోటీ చెయ్యనే లేదు... కానీ ప్రజల మనసలను గెలిచిన నాయకుడు పవన్ కళ్యాణ్. అన్నా అంటే పలికే దైవం.. అన్నార్థుల ఆకలిని తెలిసిన మామూలు వ్యక్తి. జనం కష్టాల మీద కుమిలిపోయే ప్రజా నాయకుడు. దేశం అంటే పిచ్చి అంతకు మించి వెర్రి. ఇలా రాసుకుంటూ, చెప్పుకుంటూ పోతే కాగితాలు  సరిపోవు.. మాటలు సరిపోవు.

Also Read:  ఫలించిన ఫవన్ కల్యాన్ వ్యూహం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం..

హంగు, హార్భాటాలకు దూరంగా ఓ మామూలు రైతుగా తన జీవితాన్ని గడిపేందుకు పవన్ కళ్యాణ్ ఎంతో ఇస్టపడతారు. ఏ స్టార్ కూడా ఇలాంటివి కోరుకోరు. కానీ పవన్ కళ్యాణ్ తాను ఓ హీరో అని, విఐపిని అని కాకుండా నేను మామూలు వ్యక్తిని, భూమాత ఒడిసి ముద్దాడేందుకు అడ్డంకులెందుకు అని పవన్ కళ్యాణ్ భావిస్తారు. అందుకే తాను సినిమాలు, రాజకీయాల నుండి కాసింత విరామం దొరికినా వెంటనే తన తోటలో పనివాడిగా మారతాడు. అీ సింప్లిసిటి అంటే.. అది వ్యక్తిత్వం అంటే. పది మందిలో ఒకడిగా కాదు.. పది మందికి ఒక్కడిగా ఎదిగారు. నాయకుడు, హీరో, మానవతావాది, దేశభక్తుడు, ఇలా పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా కానీ చివరకు ప్రశ్నలో మిగిలిపోయిన ప్రశ్నార్థకం లాంటి వాళ్లు పవన్ కళ్యాణ్. చీకటి తలుపులను తడుతూ తడుతూ వెలుగు కిరణాలను వెతికే నిత్య సంచారి పవన్ కళ్యాణ్.

 

*Abhinavachary*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles