Bandh | YSRCP | Jagan | Special status

State wide bandh on special category status for ap

Bandh, YSRCP, Jagan, Special status, Vijayawada, Vishakapatnem, Bosta Satyanarayana

State wide bandh on special category status for AP The day-long state-wide bandh called by YSR Congress over the special category status issue for Andhra Pradesh began today with party workers and leaders staging protests in front of bus deports belonging to the State Road Transport Organisation (APSRTC).

బంద్ సంపూర్ణం.. అక్కడక్కడ హింసాత్మక ఘటనలు

Posted: 08/29/2015 04:17 PM IST
State wide bandh on special category status for ap

ప్రత్యేక హోదా కోసం వైసీపీ తలపెట్టిన ఏపీ బంద్ ముగిసింది.  13 జిల్లాల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కన్పించింది.. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. చాలా చోట్ల వాహనాలు తిరగ లేదు.. బంద్ సందర్భంగా ఎలాంటి హింసాత్మక సంఘటనలు తలెత్తకుండా పోలీసులు వైసీపీ నేతలను చాలా చోట్ల ముందుస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. . ఇవాళ్టి బంద్ కు వామపక్షాలు, విద్యార్థి సంఘాలు, పెట్రోల్ బంక్ ల యజమానులు మద్దతు ప్రకటించడంతో బంద్ ప్రభావం మరింతగా కన్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే బసు డిపోల ముందు వైసీపీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. దీంతో ఎక్కడి బస్సులు అక్కడే నిల్చిపోయాయి. అయితే పలు చోట్ల పోలీసుల బందో బస్త్ నడుమ బస్సులను నడిపించే ప్రయత్నం చేశారు. విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రిలలలో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేతల అరెస్టులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ ధర్నాకు దిగడంతో పూర్తి స్థాయిలో బంద్ ప్రభావం కనిపించింది.

ఏపీ వ్యాప్తంగా బంద్‌ సంపూర్ణం గా ముగిసిందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రత్యేక ప్యాకేజీకి వైసీపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే ప్రత్యేక హోదా సాధించడమనేది ప్రధానమని ఆయన చెప్పారు. వామపక్షాలు, ప్రజాసంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బంద్‌ను అడ్డుకోవాలన్న ప్రభుత్వ చర్యలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా అంశాలను ప్యాకేజీ కిందకు తీసుకురావడం ఎంతవరకు సమంజసమని బొత్స ప్రకటించారు. హోదా కోసం ఎన్నిరోజులు వేచిచూడాలో పవన్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కుయక్తులు మానుకుని ప్రత్యేకహోదాపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయమని బొత్స అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bandh  YSRCP  Jagan  Special status  Vijayawada  Vishakapatnem  Bosta Satyanarayana  

Other Articles