sompeta power plant | AP | cabinet | Acheenaidu

Ap govt took back step on sompeta power plant

sompeta power plant, AP, cabinet, Acheenaidu, Chandrababu Naidu

AP Govt took back step on sompeta power plant. AP Cabinet took a decision on sompeta power plant. prople protesting to stop the sompeta power plant

ITEMVIDEOS: సోంపేట్ థర్మల్ ప్లాంట్ రద్దు

Posted: 08/29/2015 05:41 PM IST
Ap govt took back step on sompeta power plant

సోంపేట ధర్మల్ ప్లాంట్ పోరాటానికి తెర పడనుంది. ఎంతో కాలంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి అక్కడి వారు అడ్డుతగులుతూనే ఉన్నారు. అయితే ప్రజా పోరాటంతో విసిగిపోయిన ప్రభుత్వాలు తోక ముడవాల్సి వస్తుంది అన్నది నిజం. గత చరిత్రే దీనికి సాక్షం. తాజాగా ఏపిలో కూడా ఇదే జరిగింది. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సోంపేట పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి తీపి కబురునందించారు. ఈ మేరకు మంత్రి వర్గం ఓ నిర్ణయం తీసుకుంది. కాగా ప్రభుత్వం నిర్ణయం మీద కూడా కొంత మంది పెదవి విరుస్తున్నారు. పోరాటం చేసి అలసిపోయిన ప్రజలకు ఇది పెద్దగా సంతోషాన్ని కలిగించదని, అలాగే ఏపిలో రాజకీయ కారణాలు స్పష్టంగా చెప్పాలంటే నేటి బంద్ వార్తలను కనిపించకుండా చేసేందుకు ప్రభుత్వం హుటాహుటిని సోంపేట ప్రాజెక్ట్ ను తెర మీదకు తీసుకువచ్చింది అని అభిప్రాయం కూడా ఉంది.

సోంపేట థర్మల్‌ ఫ్లాంట్‌ను రద్దు చేస్తూ ఏపీ కేబీనెట్‌ నిర్ణయం తీసుకుంది. థర్మల్‌ ఫ్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి 1107 జీవోను రద్దు చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా థర్మల్‌ ఫ్లాంట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. థర్మల్‌ ఫ్లాంట్‌కు ఏపీఐఐసీ కేటాయించిన 972 ఎకరాల భూమిలో మల్టీ ప్రొడక్ట్‌ వ్యవసాయ ఆధార పరిశ్రమలు నెలకొల్పుతామని ఆయన వెల్లడించారు. జీవోను రద్దు చేసినందున థర్మల్‌ ఫ్లాంట్‌కు వ్యతిరేకంగా చేస్తున్న దీక్షలను నిలిపివేయాలని సోంపేట వాసులకు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sompeta power plant  AP  cabinet  Acheenaidu  Chandrababu Naidu  

Other Articles