Rajahmundry | Police station | YSRCP

Ysrcp leaders attacked on rajahmundry police station

Rajahmundry, Police station, YSRCP, AP Bandh, Jagan

YSRCP Leaders attacked on Rajahmundry police station while ap bandh.In Rajahmundry ysrcp leaders attacked on a police station and distroied furniture.

పోలీస్ స్టేషన్ మీద వైసీపీ నాయకుల దాడి

Posted: 08/29/2015 03:32 PM IST
Ysrcp leaders attacked on rajahmundry police station

ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఇచ్చిన బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వైసీపీ నాయకులు అనుకున్నట్లుగానే ఉద్రిక్తతకు వైసీపీ నాయకులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. జగన్ సభలోనే నేరుగా బంద్ గట్టిగా చేసి తీరుతాం.. అవసరమైతే రోడ్ల మీదున్న బస్సుల అద్దాలను ధ్వంసం చేసైనా సరే బంద్ ను విజయవంతం చేస్తామన్న మాటలు వాస్తవమయ్యాయి. అయితే అక్కడ బస్సు అన్నారు కానీ బస్సు కాకుండా ఏకంగా పోలీస్ స్టేషన్ మీదే దాడిచేసి వైసీపీ నాయకులు తమ ప్రతిభ ఏంటో నిరూపించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. ప్రకాష్‌నగర్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి దాడి చేశారు. స్టేషన్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

రాజమండ్రి ప్రకాష్‌నగర్ పోలీస్‌స్టేషన్‌ను వైసీపీ నాయకులు ముట్టడించి దాడి చేశారు. పోలీస్ స్టేషన్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ప్రకాష్‌నగర్ ఎస్‌ఐ శివగణేష్‌తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు వీరబాబు, గంగాధర్‌లు స్వల్పంగా గాయపడ్డారు. బంద్ సందర్భంగా నిరసనకు దిగిన వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తనయుడు ఆదిరెడ్డి వాసు, జక్కంపూడి రాజా సోదరుడు గణేష్‌ను అరెస్ట్ చేసి ప్రకాష్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు-వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దీంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లపై దాడి చేశారు. వెంటనే పెద్దసంఖ్యలో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పోలీసులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రకాష్‌నగర్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajahmundry  Police station  YSRCP  AP Bandh  Jagan  

Other Articles